కొన్ని సార్లు సరదాగా మొదలు పెట్టిన పనులు.. చిన్న చిన్న హాబీలు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే చేస్తాయి. మరికొందరు తమ హాబీలను కలకాలం పదిలంగా ఉండాలని భావించి.. రికార్డ్ సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మానవులు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం కోసం రకరకాల సాహసాలు చేస్తుంటారు. అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే కొన్ని జంతువులు కూడా గిన్నిస్ రికార్డులకెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల అత్యంత వయసుకలిగి ఎక్కువకాలం జీవించి ఉన్న పిల్లి ఒకటి గిన్నిస్ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కుక్క మనుషులతో పోటీ పడుతూ స్కిప్పింగ్ ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.
ఈ శునకం నిర్ణీత 30 సెకన్లలో 32 సార్లు తన వెనుక కాళ్లతో జంప్ చేసి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
వేలాదిమంది వీడియోను వీక్షిస్తూ లైక్ చేశారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ యూజర్ ‘ఓ మై గుడ్‌నెస్ ఆ డాగ్ చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..