Viral Video: మీరెప్పుడైనా కుక్క సైకిల్ తొక్కడం చూశారా.? మాములుగా ఉండదు.. ఈ వీడియో మీకోసమే!

|

Jul 31, 2021 | 8:56 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువులు చేసే అల్లరి పనులు...

Viral Video: మీరెప్పుడైనా కుక్క సైకిల్ తొక్కడం చూశారా.? మాములుగా ఉండదు.. ఈ వీడియో మీకోసమే!
Dog
Follow us on

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువులు చేసే అల్లరి పనులు చూసేందుకు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను భలేగా ఆకట్టుకుంటాయి. అయితే మీరెప్పుడైనా కుక్క సైకిల్ తొక్కడం చూశారా.? లేదంటే.! ఈ వీడియో మీకోసమే. ఇరుకైన సందుల్లో ఈ శునకం ఈజీగా సైకిల్ నడుపుతోంది.

ట్రైనింగ్ ఇస్తే కుక్కలు ఎలాంటి పనులైనా చేయగలవు. ఇంట్లో మనతో ఎక్సర్‌సైజులు, షాపింగ్, లేదా మనకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు తెస్తూ కుక్కలు మనుషులకు ఎప్పుడూ విశ్వాసంతో ఉంటాయి. ఈ నాలుగు కాళ్ల జంతువు ఇప్పుడు సైకిల్ తొక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇరుకైన సందులో భలే ఈజీగా నడిపేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘animals_dose’ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. జంతు ప్రేమికులు దీన్ని విపరీతంగా ఇష్టపడుతున్నారు. లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.