సంగీతాన్ని (Music) ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మంచి సంగీతం చెవిన పడితే ఆటోమేటిక్‌గా మైండ్ అటు డైవర్ట్ అవుతుంది. కాళ్లు డ్యాన్స్ చేసేందుకు ముందుకు కదులుతాయి. అది మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే సంగీతం, పాటలు ఎప్పటికప్పుడు ఫేమస్ అవుతూ ఉంటాయి. సరిగమలు వినిపిస్తుంటే చలించని వారు ఎవరుంటారు చెప్పండి.. మనుషుల నుంచి జంతువుల వరకు అందరూ మ్యూజిక్ కు రియాక్ట్ అవుతుంటారు. ఇదిలా ఉంటే ఓ శునకం సంగీతానికి ముగ్ధరాలైంది. ప్లే చేస్తున్న వాయిద్యాల వద్దే ఉంటూ చక్కగా సంగీతాన్ని ఆస్వాదించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఓ బార్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుండగా ఓ వీధి శునకం బార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా మ్యూజిక్ ప్లే చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి అక్కడే కూర్చుని మ్యూజిక్‌ను ఆస్వాదించింది. అంతేకాదు మ్యుజీషియన్‌తో కలిసి గిటార్ ప్లే చేసింది. ఆ కుక్క ఆసక్తిని గమనించిన ఆ మ్యుజీషియన్ కూడా దానితో గిటార్ ప్లే చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
బార్‌లో లైవ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసిన కుక్క ఇంకా కావాలనే మూడ్‌లో మ్యుజీషియన్‌తో కలిసి గిటార్ వాయించడం చూపరులను ఆకట్టుకుంది. ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుక్కకు సంగీతం తెలుసనుకుంటా.. క్యూట్ డాగ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..