Momos: ఓరీ దేవుడో.. అక్కడ మోమోస్ తిన్నారో ఇక చచ్చారే.. కుక్క మాంసంతో..

ఫ్యాక్టరీ ఫ్రీజ్‌లో కుక్క తల బయటపడిందని చెప్పారు. ఫ్యాక్టరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సమాచారం అందించినట్టుగా వివరించారు. అయితే, మోమోల తయారీలో ఈ మాంసాన్ని ఉపయోగించలేదని, తాము తింటామని ఫ్యాక్టరీ కార్మికులు చెప్పినట్టుగా అధికారులు పేర్కొన్నారు. మోమోస్, స్ప్రింగ్ రోల్స్‌తో పాటు చట్నీ నమూనాలను కూడా ల్యాబ్ టెస్టింగ్‌కు పంపించినట్టుగా అధికారులు స్పష్టం చేశారు.

Momos: ఓరీ దేవుడో.. అక్కడ మోమోస్ తిన్నారో ఇక చచ్చారే.. కుక్క మాంసంతో..
Momos

Updated on: Mar 18, 2025 | 7:26 PM

గత కొంతకాలంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారం ఎలా తయారు చేస్తారో చూపించే ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ తయారు చేస్తున్న ఆహారం తింటున్న మన ఆరోగ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆలోచిస్తేనే ప్రాణం పోతుంది. అపరిశుభ్రమైన వాతావరణంలో, అన్ని కల్తీ పదార్థాలను ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్‌ సిబ్బంది. తాజాగా మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ జిల్లా మాటౌర్ గ్రామంలో అక్రమంగా నడుస్తున్న మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్‌పై మున్సిపల్ కార్పొరేషన్ వైద్య బృందం దాడి చేసింది. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను గుర్తించారు.

అధికారులు చెప్పిన వివరాల మేరకు.. ఫ్రీజర్‌లో కుక్క తల, కుళ్లిపోయిన కూరగాయలు, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన మాంసం ఉండటం చూసిన అధికారులే షాక్‌ తిన్నారు. మోమోలు తయారు చేసే ప్రదేశం అసహ్యకరమైన స్థితిలో ఉండటంతో, అధికారులు విస్తుపోయారు. ఫ్రీజ్‌లో ఉన్న మాంసం ఏ జంతువుదో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ స్వాధీనం చేసుకున్న మాంసం ల్యాబ్ టెస్టింగ్‌ కోసం తరలించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ మేరకు అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ అమృత్ వారింగ్ మాట్లాడుతూ మోమోస్ తయారీ యూనిట్‌పై ఆకస్మిక తనిఖీలు జరిపినట్టుగా వెల్లడించారు. ఫ్యాక్టరీ ఫ్రీజ్‌లో కుక్క తల బయటపడిందని చెప్పారు. ఫ్యాక్టరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సమాచారం అందించినట్టుగా వివరించారు. అయితే, మోమోల తయారీలో ఈ మాంసాన్ని ఉపయోగించలేదని, తాము తింటామని ఫ్యాక్టరీ కార్మికులు చెప్పినట్టుగా అధికారులు పేర్కొన్నారు. మోమోస్, స్ప్రింగ్ రోల్స్‌తో పాటు చట్నీ నమూనాలను కూడా ల్యాబ్ టెస్టింగ్‌కు పంపించినట్టుగా అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..