Viral Video: బామ్మ చప్పట్లకు.. కుక్క డ్యాన్స్ అదుర్స్.. వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..

Dog Dance Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే..

Viral Video: బామ్మ చప్పట్లకు.. కుక్క డ్యాన్స్ అదుర్స్.. వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..
Dog Dance
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2021 | 2:00 PM

Dog Dance Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి వాటిల్లో కుక్కలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. చాలామంది ఇళ్లల్లో కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి ఏం నేర్పితే.. అవి చేస్తుంటూ ఉంటాయి. కుక్కలు యోగా చేయడం.. షాపింగ్ చేయడం, క్రికెట్ ఆడటం లాంటి వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేశాయి. అయితే.. తాజాగా కుక్క డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బామ్మ చేతులతో చప్పట్లు కొడుతుంటే.. కుక్క డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. కుక్క అద్భుతంగా నృత్యం చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తుంది. వీడియోలో ఓ వృద్ధ మహిళ వీల్ చైర్‌పై కూర్చుని చప్పట్లు కొడుతుండగా.. కుక్క అదే ట్యూన్‌లో డ్యాన్స్ చేయడాన్ని మీరు కూడా చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఇది ఇప్పటివరకు 57 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ProfmakeUsmile అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. వీడియోతో పాటు ఓ అందమైన క్యాప్షన్ కూడా రాశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించి లైక్‌లు చేయడంతోపాటు పలు రకాల కామెంట్‌లు చేస్తున్నారు. దీంతోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా షేర్ చేస్తున్నారు. దీనిపై ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ‘నేను కూడా అలాంటి నృత్యం చేయలేను’ అంటూ రాశాడు. మరో యూజర్.. మహిళ, కుక్క సాన్నిహిత్యం చూడండి.. వీడదీయరాని అనుబంధం అంటూ రాశారు. కుక్క డ్యాన్స్ చేస్తున్న వీడియో అద్భుతంగా ఉందని.. దీనిని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చాలామంది యూజర్లు పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.. వైరల్ వీడియో..

ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిని చూసి చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Also Read:

Triple Talaq: నల్లగా ఉన్నావంటూ తలాక్.. పెళ్లైన తొమ్మిది నెలలకే బయటపడిన దుర్మార్గుడి అసలు రంగు

Viral Video: కోతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. కానీ వానరం ఏం చేసిందో చూస్తే షాకే.. వీడియో వైరల్