Viral Video: ప్రస్తుతం లోకం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. సమస్తం డబ్బుమయం.. మానవ సంబంధాలు అన్నీ వ్యాపార బంధాలే అన్నచందంగా మారిపోయాయి. నేడు డబ్బుకు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కానీ రాను రాను డబ్బే ప్రధానం అన్నట్టుగా మనుషులు మారిపోయారు. కొందరు డబ్బుకి ఇచ్చే విలువ బంధాలు, అనుబంధాలకు ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. డబ్బు చాలా విలువైంది.. ఈ విషయం మనుషులకే కాదు.. ఈ మధ్య జంతువులకు కూడా తెలిసిపోతోంది. అవి కూడా డబ్బుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియోను ఇప్పుడు మీరు చూడబోతున్నారు.
ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్లినప్పుడు ఆ కుటుంబంలోని చిన్న పిల్లలకు వారి సంతోషాన్ని తెలుపుతూ డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగే వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా బంధువుల ఇంటికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ అక్కడ సోఫాలోకూర్చున్న ఇద్దరు వ్యక్తులకు ఆ వ్యక్తి చెరో 100 రూపాయలు నోట్లు ఇచ్చాడు. ఆ పక్కనే వాళ్ల పెంపుడు కుక్క కూర్చుని ఉంది. తనకు కూడా డబ్బులు కావాలన్నట్లు ఆ వ్యక్తివైపు చూసింది. అతను ఆ కుక్కకు వందకన్నా తక్కువ నోటు ఇచ్చాడు. అయితే ఆ కుక్క ఆనోటును తీసుకోలేదు సరికదా మళ్ళీ అతని వంక మళ్ళీ చూస్తుండంతో.. మరో నోటు ఇచ్చాడు. అదీ తీసుకోలేదు. తనకు కూడా ఇద్దరికీ ఇచ్చిన నోటే తనకూ కావాలన్నట్టుగా అతనిపై చూస్తూ.. మొరిగింది ఆ కుక్క. దీంతో ఆ పిల్లలకు ఇచ్చిన నోటే కుక్కకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఆనందంగా ఆనోటు తీసుకుంది. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షించడమే కాదు.. వేలల్లో లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: KGF actor: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత..
Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో కమల్ సందడి.. మీరు గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అంటున్న కపిల్
Chanakya Niti: ఈ జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలంటే.. ఈ 5 విషయాలను పాటించమంటున్న చాణక్య
Mothers Day 2022: సృష్టికి మూలం అమ్మ .. రేపే మాతృదినోత్సవం.. అసలు మదర్స్ డే ఎలా పుట్టిందంటే..