
కరోనా పుణ్యమా అని డబ్బులు చేతులు మారడం తక్కువైపోయాయి. దానికి బదులుగా నగదు చెల్లింపులు అమలులోకి వచ్చేశాయి. ఇక నోట్లు ఇవ్వడం తగ్గిపోవడంతో.. వచ్చే అరకొర వాటిని పెద్దగా పరిశీలించడం మానేశారు యజమానులు. దీంతో ఓ రోగి ఏకంగా వైద్యుడినే బోల్తా కొట్టించాడు. నకిలీ నోటు ఇచ్చి ఎంచక్కా వైద్యం చేయించుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత అది నకిలీ నోటు అని తెలుసుకున్న వైద్యుడు ఖంగుతిన్నాడు. ఇక ఈ విషయాన్ని ఆ డాక్టర్ ఇంటర్నెట్‌లో నెటిజన్లతో పంచుకున్నాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో వివరించారు.
డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్ గా రోగులకు సేవలందిస్తున్నారు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద 500 రూపాయల నోటు ఇచ్చాడు. ఆ సమయంలో రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే తీసుకుంది. ఆ తర్వాత రోగికి డాక్టర్ వైద్యం చేసి.. మందులు ఇవ్వడం అయిపోయింది. అనంతరం అతడు వెళ్లిపోయాడు. ఇక తన షిఫ్ట్ అయ్యాక డాక్టర్ తనకొచ్చిన డబ్బులు లెక్కపెడుతుండగా.. ఓ ఫేక్ 500 నోటును గుర్తించాడు. రెండు ముక్కలు అతికించి ఉన్న నోటును చూసి చాలా నవ్వుకున్నానని.. ఇది తనకు ఓ ఫన్నీ మెమరీగా ఉండిపోతుందన్నారు. దీన్ని అతడు నెటిజన్లతో పంచుకోగా.. ఇలా జరిగినందుకు బాధపడాలా.? జాలిపడాలా.? అని కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Post by @dr.mananvoraView on Threads