సస్పెన్స్, థ్రిల్లర్ మూవీలు అంటే ఎవరికి నచ్చవు చెప్పండి. పాత సినిమాలైనా సరే మళ్లీ, మళ్లీ చూస్తుంటారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హత్య చేసిన నిందితిడుని పోలీసు ఆఫీసర్ తన ఆలోచన శక్తితో పసిగడుతుంటారు. మర్డర్ లేదా దొంగతనం జరిగిన ప్రదేశాల్లో కనిపించే సన్నివేశం ఆధారంగా నేరస్థులను పట్టుకుంటారు. అయితే ఇలాంటి చూసేప్పుడు అర్రె.. భలే ఆలోచన వచ్చిందే అనిపిస్తుంటుంది.
ఇలా మన ఆలోచన శక్తిని పరీక్షించే కొన్ని బ్రెయిన్ టీజర్‌లు కూడా ఇటీవల నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. ఫొటోలో కొన్ని చిన్న చిన్న ఆధారాలను ఇచ్చి పజిల్‌ను సాల్వ్ చేయమని ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ బ్రెయిన్ టీజర్ నెటిజన్లను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్‌లా ఆలోచించే సత్తా ఉన్న వారు ఈ పజిల్‌ను ఇట్టే సాల్వ్ చేస్తారు. పైన కనిపిస్తోన్న ఫొటోలో ఒక ఆఫీసులో దొంగతనం జరిగింది. అయితే అక్కడ ఉన్న ముగ్గిరిలో దొంగతనం చేసిన వ్యక్తి ఉన్నాడు. ఇంతకీ ఆ దొంగ ఎవరో కనిపెట్టడమే ఆ పజిల్ ముఖ్య ఉద్దేశం. మరి ఫొటోని గమనించి మీరా పజిల్ సాల్వ్ చేయగలరా.? 20 సెకండ్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే మీరే తోపులు.
ఆ ముగ్గురిలో ఉన్న దొంగను గుర్తించేందుకు అక్కడే ఒక క్లూ కూడా ఉంది. ఇంతకీ ఆ దొంగ ఎవరో గుర్తుపట్టారా.? ఏంటి ఎంత ఆలోచించిన సమస్యను సాల్వ్ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి ఆ గదిలో ఉన్న చెప్పుల అచ్చులను, ముగ్గురు ధరించిన పాద రక్షలను జాగ్రత్తగా గమనించండి. ముగ్గురిలో ఇద్దరు మహిళలు హైహీల్స్ ధరించారు, ఒకతను మాత్రం షూస్ వేసుకున్నాడు. ఇక అచ్చుల విషయానికొస్తే రెండు రకాల అచ్చులు కనిపిస్తున్నాయి. ఒకటి స్పోర్ట్స్ షూస్ మరొకటి, ఫార్మల్ షూస్ అచ్చులు. ఫొటోలో కనిపిస్తున్న ఫార్మల్ షూస్ గదిలో ఉన్న బిజినెస్ మ్యాన్‌కు సంబంధించినవి. అలాగే స్పోర్ట్స్ షూస్ అప్పటికే గదిలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఆ దొంగ మరెవరో కాదు స్పోర్ట్స్ షూస్ ధరించిన యువకుడే అని తేలిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..