Reticulated Python: పైథాన్‌లు ఓ మనిషిని ఎంతసేపట్లో మింగేస్తాయో తెల్సా.?

|

Jul 01, 2024 | 6:18 PM

సరీసృపాలలో కొండచిలువలు అత్యంత బలమైనవి. కింగ్ కోబ్రా దగ్గర నుంచి కట్లపాము వరకు.. పాములు ఏవైనా కూడా తమ ఎరను ఒక్క కాటుతో చంపేస్తాయి. అయితే పైథాన్‌లు అలా కాదు.. వేటాడిన తమ ఎరకు మొదటిగా ఊపిరాడకుండా చేసి.. ఆ తర్వాత వాటిని అమాంతం మింగేస్తాయి.

Reticulated Python: పైథాన్‌లు ఓ మనిషిని ఎంతసేపట్లో మింగేస్తాయో తెల్సా.?
Pythons
Follow us on

సరీసృపాలలో కొండచిలువలు అత్యంత బలమైనవి. కింగ్ కోబ్రా దగ్గర నుంచి కట్లపాము వరకు.. పాములు ఏవైనా కూడా తమ ఎరను ఒక్క కాటుతో చంపేస్తాయి. అయితే పైథాన్‌లు అలా కాదు.. వేటాడిన తమ ఎరకు మొదటిగా ఊపిరాడకుండా చేసి.. ఆ తర్వాత వాటిని అమాంతం మింగేస్తాయి. ఇక పైథాన్‌ల జాతుల గురించి మాట్లాడుకుంటే.. రెటిక్యులేటెడ్ పైథాన్‌లను ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి, బరువైనవిగా చెబుతుంటారు. ఇండియన్ రాక్ పైథాన్, బర్మీస్ పైథాన్ తర్వాత ఈ రెటిక్యులేటెడ్ పైథాన్ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. వీటి చర్మాన్ని కొన్ని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు.

ఈ రెటిక్యులేటెడ్ పైథాన్‌లు చాలా ప్రమాదకరమైనవి. వీటికి చిక్కితే అది జంతువైనా.. లేక మనిషైనా.. క్షణాల్లో చనిపోవడం ఖాయం. ఇవి తమ ఎరను ఊపిరాడకుండా చేసి.. ఆ తర్వాత మింగేస్తాయి. అంతేకాదు ఈ రెటిక్యులేటెడ్ పైథాన్‌లు మనిషిని కేవలం అరగంటలో మింగేస్తాయని చెబుతారు.

రెటిక్యులేటెడ్ పైథాన్‌ల గురించి ఆసక్తికర విషయాలు..

– ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాములు. దాదాపుగా 20 నుంచి 25 అడుగుల పొడవుంటాయి. ఇప్పటికే 25 అడుగుల అంతకంటే ఎక్కువ పొడవు ఉన్న మెడుసా అనే రెటిక్యులేటెడ్ పైథాన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.

– చిన్న కొండచిలువలు ఎలుకలు, గబ్బిలాలు లాంటి వాటిని తింటే.. పెద్ద కొండచిలువలు కోతులు, పందులు, జింకలను మింగేస్తాయి. కొన్నిసార్లయితే కోళ్లు, కుక్కలు, పిల్లులు లాంటివి కూడా తింటాయి. అయితే రెటిక్యులేటెడ్ పైథాన్‌లు భారీగా, పొడవుగా ఉంటాయని గనుక.. అవి మనుషులను సైతం మింగేస్తాయి. ఇవి మనిషిని ఒక అరగంటలోపు పూర్తిగా మింగేస్తాయట.