Snakes Nagamani: పాములకు నిజంగానే నాగమణి ఉంటుందా? కథలకు మాత్రమే పరిమితమా?

|

Jul 19, 2021 | 8:32 AM

Snakes Nagamani: ‘నాగమణి’ ఈ పదం చాలాసార్లు వినే ఉంటారు. నాగుపాముు తలపై ఒక రత్నం ఉంటుందని, దానినే ‘నాగమణి’ అనే అంటారని..

Snakes Nagamani: పాములకు నిజంగానే నాగమణి ఉంటుందా? కథలకు మాత్రమే పరిమితమా?
Nagamani
Follow us on

Snakes Nagamani: ‘నాగమణి’ ఈ పదం చాలాసార్లు వినే ఉంటారు. నాగుపాముు తలపై ఒక రత్నం ఉంటుందని, దానినే ‘నాగమణి’ అనే అంటారని పెద్దలు చెబుతుంటారు. ఈ ‘నాగమణి’కి సంబంధించి అనేక కథలు, కథనాలు వాడుకలో ఉన్నాయి. వాటికి సంబంధించి కథలు, కథనాలు ఎన్నో వినడం, చదవడం చేసే ఉంటారు. అయితే, నిజం ఏంటనేది మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది నాగమణి ఉందని నమ్మితే.. మరికొందరు అలాంటిదేమీ లేదని అంటుంటారు. అదంతా కల్పితం అని అంటు కొట్టిపడేస్తుంటారు. అయితే, నాగమణిని నిజంగా ఎవరైనా చూశారా? అంటే ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. అయితే, వరాహ మిహిరుడు రచించిన పురాతన గ్రంథమైన బృహత్‌సంహిత‌లో ఈ నాగమణి గురించి ఆసక్తికరమైన విషయాలు పేర్కొనడం జరిగింది.

నాగమణి కాంతి ఎలా ఉంటుందంటే..
వరాహ మిహిరుడు రచించిన బృహత్‌సంహిత ప్రకారం.. ‘నాగమణి’ ఒక కల్పితం కాదు. అది భూమిపై ఉంది. ఈ ‘నాగమణి’ ని సర్పమణి అని కూడా అంటారు. ఇది పాము తలపై ఉంటుందని వరాహ మిహిరుడు పేర్కొన్నారు. అయితే.. నాగమణి కలిగిన పాములు చాలా అరుదుగా ఉంటాయి. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీని నుంచి వెలువడే కాంతి ఒక అగ్నిలా చుట్టూ వెలుతురును అందిస్తుంది. ఇది ఎక్కడ ఉంటే.. ఆ ప్రాంతం అంతా ప్రకాశవంతంగా కనిపిస్తుందని వరాహమిహిరుడు పేర్కొన్నారు.

బృహత్‌సంహితలో ఇంకా ఏం చెప్పారంటే..
ఈ బృహత్‌సంహితలో ఉన్న సమాచారం ప్రకారం.. ‘నాగమణి’ మిగతా రత్నాల కన్నా చాలా ఎక్కువ ప్రభావవంతమైనది, అతింద్రీయమైనది. ఈ ‘నాగమణి’ని ధరించిన వ్యక్తులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వ్యాధులు, ఇతర రుగ్మతలు వీరిని ధరిచేరవు. అంతేకాదు.. ‘నాగమణి’ని ధరించిన వారిపై విష ప్రభావం ఉండదట. పురాతన కాలంలో రాజుల ఈ ‘నాగమణి’ని ధరించేవారట. ఈ నాగమణిని ధరించిన రాజులకు ఓటమి అనేది తెలియదని బృహత్ సంహితలో వరాహమిహిరుడు పేర్కొన్నారు. అలాగే ఈ నాగమణి ఉన్న రాజ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. ఆ ప్రాంతంలోని ప్రజలంతా సుభిక్షింగా జీవిస్తారట. ఇదంతా ఇలా ఉంటే.. ప్రస్తుతం నాగ్మణి గురించి నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేదని మీకు తెలియజేద్దాం.

Also read:

India vs Srilanka: కెప్టెన్‌గా ఎంట్రీ.. రికార్డులు కొల్లగొట్టిన గబ్బర్.. లెజెండ్ల సరసన..!

TS Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లు.. సమయం కుదింపు.!

Visakhapatnam: బీచుల అభివృద్ది తో సుందర విశాఖకు మరింత పర్యాటక శోభ.. వీడియో