Diwali Ends Celebrations: ఇదేం ఆచారం సామీ.. పేడలో మునిగి తేలుతున్నారు ప్రజలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Diwali Ends Celebrations: కాలం మారుతోంది. ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.

Diwali Ends Celebrations: ఇదేం ఆచారం సామీ.. పేడలో మునిగి తేలుతున్నారు ప్రజలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Cow Dung

Updated on: Nov 08, 2021 | 1:47 PM

Diwali Ends Celebrations: కాలం మారుతోంది. ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశంలోనూ మార్పు మొదలైంది. కోట్లాది ప్రజలు, విభిన్నమైన జాతుల వారు, మతాల వారు, కులాల వారు నెలవైన భారతదేశంలో వింత ఆచారాలు, సంప్రదాయాలకు కొదవే లేదు. అయినప్పటికీ.. మారుతున్న కాలానుగుణంగా, పరిస్థితులకు తగ్గట్లుగా జనాలు జీవనాన్ని సాగిస్తున్నారు. అదే సమయంలో తర తరాల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను రక్షించుకునే ప్రయత్నమూ చేస్తున్నారు.

ముఖ్యంగా మన దేశంలో వింత ఆచారాలు, సంప్రదాయాలకు కొదువే లేదు. చాలా చోట్ల కొన్ని వింత వింత ఆచారాలు చూస్తుంటాం. తాజాగా ఇలాంటిదే మరో వింత ఆచారం ఒకటి వెలుగు చూసింది. ఒకరిపై ఒకరు ముఖాల మీద పేడను పిడకలు అయ్యేలా కొట్టుకుంటున్నారు. భరించలేనంత వాసన వస్తున్నా అసలెవ్వరు తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇదంతా కోపంగా కాదండోయ్. కేవలం అక్కడ కొన్ని సంవత్సరాలుగా వారు పాటిస్తున్న ఆనవాయితీ మాత్రమేనట. అది కూడా దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతీయేటా ఇలా పేడతో కొట్టుకుంటారు. ఇంటింటికీ తిరుగుతూ పాలు సేకరిస్తున్నారు. వారు భక్తితో కొలిచే వీరేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ వీరి వేషధారణ కూడా భిన్నంగానే ఉంది.

ఇది ఎక్కడంటే..
కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గుమ్మటపురాలో ఈ పేడ ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించుకునే సమయానికి ఒక నెల ముందు నుంచి వారి ఊర్లలో పేడ నిల్వ చేసుకుని ఆ తర్వాత వాటిని ఈ విధంగా ఉపయోగిస్తారు. కేవలం ఆ ఊర్లో మాత్రమే కాదు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా పేడను ట్రాక్టర్లతో తీసుకువచ్చి ఇక్కడ ఉత్సవానికి ఉపయోగిస్తారు. ఈ ఉత్సవాన్ని గోరే హబ్బ అని పిలుస్తారు. పేడను పెద్ద పెద్ద ముద్దలుగా చుట్టుకొని ఎదుటివారి పై కొట్టడమే ఈ పండుగలో ఆనవాయితీ.

ఇకపోతే ఈ ఊరి ప్రజలు దేవుడిగా కొలిచే వీరేశ్వరస్వామి ఆవు పేడలో జన్మించారని ఆ గ్రామస్తుల నమ్మకం. అందుకే అక్కడ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు అందరూ పేడను కుప్పలు కుప్పలుగా పోగుచేసి ఒకరిపై ఒకరు కొట్టుకుంటారు. ఇలా చేసుకోవడం ద్వారా వారికి అనారోగ్యాలు దరిచేరవు అని, అంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారని వీరి నమ్మకం. అయితే ఈ వేడుకలో స్త్రీలు మాత్రం పాల్గొనరు. కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు. అది కూడా ఒంటి మీద చొక్కాలు లేకుండా పేడతో కొట్టుకుంటారు.

Also read:

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్టపరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!

LK Advani Birthday: రాజకీయ కురు వృద్ధుడు అద్వానీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..