Pakistan Currency: పాక్ రూపిని మీరెప్పుడైనా చూశారా.? హయ్యస్ట్ కరెన్సీ నోట్ అక్కడెంతో తెలుసా!

|

Sep 11, 2022 | 1:30 PM

దాయాది దేశమైన పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా.? మన కరెన్సీతో పోలిస్తే.. పాక్ కరెన్సీ విలువ ఎంత ఉంటుంది.?

Pakistan Currency: పాక్ రూపిని మీరెప్పుడైనా చూశారా.? హయ్యస్ట్ కరెన్సీ నోట్ అక్కడెంతో తెలుసా!
Pakistan Currency
Follow us on

దాయాది దేశమైన పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా.? మన కరెన్సీతో పోలిస్తే.. పాక్ కరెన్సీ విలువ ఎంత ఉంటుంది.? వ్యత్యాసం ఏంటి.? అనే విషయాలు ఏమైనా తెలుసా.? పాక్ కరెన్సీ నోట్ల ముద్రణ ఎలా ఉంటుంది.? లాంటి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత కరెన్సీతో పోలిస్తే.. పాకిస్తాన్ కరెన్సీ కొంచెం భిన్నంగా ఉంటుంది. మన దగ్గర రూ .1, రూ .2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ .50, రూ .100, రూ .200, రూ .500, రూ .2000 చలామణీలో ఉన్నాయి. అలాగే దేశంలో హయ్యస్ట్ కరెన్సీ రూ. 2 వేల నోట్. ఇక పాకిస్తాన్‌లో హయ్యెస్ట్ కరెన్సీ రూ. 5 వేల నోట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. ఆ దేశంలో రూ .1, రూ .2, రూ .5, రూ .10 కరెన్సీలు.. నాణేలుగా.. రూ .10, రూ .20, రూ .50, రూ .100, రూ .500, రూ .1000, రూ .5000 నోట్ల రూపంలో చలామణీ అవుతున్నాయి.

పాకిస్తాన్‌లో మన రూపాయి విలువ డబుల్ అవుతుంది. ఒక రూపాయి – 2.82(2.82986PKR) పాకిస్తానీ రూపాయలతో సమానం. అయితే భారత్‌లో పాకిస్తానీ కరెన్సీ విలువ అత్యల్పం. ఒక పాకిస్తానీ రూపాయి – 0.35(0.353375INR) భారత రూపాయికి సమానం.
ఇక మన రూ. 2 వేలు విలువ.. పాకిస్తాన్‌లో రూ. 5686.58(PKR)తో సమానం. అలాగే పాక్ హయ్యెస్ట్ కరెన్సీ రూ. 5 వేల నోట్.. రూ. 1,766.87 ఇండియన్ రూపాయిలతో సమానం. మరోవైపు మన రూ. 50 వేలు.. పాకిస్తాన్‌లో రూ. 1,41,493(PKR)తో సమానం. అలాగే పాక్ కరెన్సీలో రూ. 50 వేలు.. మన దగ్గర రూ. 17,668.7 ఇండియన్ రూపాయిలతో సమానం.

ఇదిలా ఉంటే మన ఇండియన్ కరెన్సీపై మహాత్మా గాంధీ చిత్రం ఉన్నట్లుగానే.. పాకిస్తాన్ కరెన్సీపై మహ్మద్ అలీ జిన్నా ఫోటో ఉంటుంది. నోట్ ముందు వైపు జిన్నా ఫోటో.. భారత కరెన్సీ మాదిరిగానే పాకిస్తాన్ నోట్లపై కూడా స్టేట్ బ్యాంక్ మొదలగునవి రాసి ఉంటాయి. మన కరెన్సీ నోట్లపై కీలక సమాచారం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉంటే.. పాకిస్తాన్‌ నోట్లపై ఉర్దూలో ఉంటుంది. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్’ అని నోట్ పైభాగంలో, క్రింద భాగంలో పలు వాగ్దాన, హామీ వ్యాక్యాలు.. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ అని లిఖించబడి ఉంటుంది. వాటర్‌మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్‌ లాంటి భద్రతాపరమైన ఫీచర్లు పాకిస్తాన్ నోట్లపై ఉన్నాయి. అలాగే వివిధ చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు సైతం ఉంటాయి. (Pakistan Currency)