Watch Video: ఐడియా అదుర్స్.. దేశీ వాషింగ్‌మెషిన్.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..

|

Nov 20, 2023 | 8:00 PM

నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. వాషింగ్ మెషిన్ 150+ లీటర్లు అంటూ కామెంట్ చేశారు.. ఇండియాలో టాలెంట్ లేదని ఎవరైనా అంటే వాళ్లకు ఈ వీడియో చూపించాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. ఇలా అయితే, కరెంట్‌ బిల్లు నెలకు రూ. 10 వేలు వస్తుందంటూ మరోకరు షాకింగ్‌ కామెంట్ చేశారు. దానికంటే వాషింగ్ మెషిన్ రూ.15వేలకు వస్తుందిగా అంటూ సలహా ఇచ్చారు. మరో వ్యక్తి ఫన్నీగా స్పందిస్తూ..ఇందులో దుప్పట్లు సరిగ్గా ఉతికేసుకోవచ్చునని రాశాడు.

Watch Video: ఐడియా అదుర్స్.. దేశీ వాషింగ్‌మెషిన్.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..
Desi Jugaad Washing Machine
Follow us on

శీతాకాలం వచ్చిందంటే చాలు..చల్లటి చలిలో ఎవరికీ ఏ పనీ చేయాలనిపించదు. ముఖ్యంగా గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం వంటి పనులు చేయాలంటే చలితో వణికిపోతుంటారు.. అయితే, చలి భయానికి చెక్‌ పెట్టేలా ఇక్కడో వ్యక్తి కొత్త ట్రిక్‌తో ముందుకు వచ్చాడు. ఇది చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. శీతాకాలం వచ్చినప్పుడు వాషింగ్ మెషీన్ ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. అయితే వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయలేని వారు ఈ ట్రిక్‌ పాటిస్తే ఇక చలికాలో బట్టలు ఉతకాలంటే భయపడాల్సి ఉండదు. వాషింగ్‌ మెషీన్‌ లేకుండానే బట్టలు ఉతికేందుకు దేశీ జుగాడ్‌ పాటించిన ట్రిక్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి డ్రమ్ సాయంతో అద్భుతమైన దేశీ వాషింగ్ మెషీన్‌ను ఎలా తయారు చేశారో చూడొచ్చు. ఈ యంత్రం ఏర్పాటు కోసం బ్లూ కలర్‌ నీళ్ల డ్రమ్, మోటారుతో తయారు చేయబడింది. చూస్తుంటే..ఈ యంత్రం చాలా బాగా పని చేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో Instagram హ్యాండిల్ @gamhasahani141 తో షేర్ చేశారు., ఇప్పటివరకు దీనికి 14.5 మిలియన్ల (1 కోటి కంటే ఎక్కువ) వీక్షణలు, 2 లక్షల 83 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వీడియోను కేవలం చూడటమే కాదు.. నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. వాషింగ్ మెషిన్ 150+ లీటర్లు అంటూ కామెంట్ చేశారు.. ఇండియాలో టాలెంట్ లేదని ఎవరైనా అంటే వాళ్లకు ఈ వీడియో చూపించాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. ఇలా అయితే, కరెంట్‌ బిల్లు నెలకు రూ. 10 వేలు వస్తుందంటూ మరోకరు షాకింగ్‌ కామెంట్ చేశారు. దానికంటే వాషింగ్ మెషిన్ రూ.15వేలకు వస్తుందిగా అంటూ సలహా ఇచ్చారు. మరో వ్యక్తి ఫన్నీగా స్పందిస్తూ..ఇందులో దుప్పట్లు సరిగ్గా ఉతికేసుకోవచ్చునని రాశాడు.

మొత్తానికి వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి భిన్నమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..