Automatic Desi Matka:మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే..!

|

Apr 24, 2024 | 7:47 PM

కుండలోని నీరు ఆటోమేటిక్‌గా మీ గ్లాస్‌లోకి వచ్చేస్తుంది. ఈ వీడియో చూసిన యూజర్లు షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేలల్లో లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు. కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. మట్టి కుండను ఆటోమేటిక్‌గా తయారు చేయడం కోసం ఉపయోగించిన వస్తువులు.

Automatic Desi Matka:మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే..!
Automatic Desi Matka
Follow us on

మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. తమ రోజువారీ వినియోగ వస్తువులతో జుగాడ్‌ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు తమ మెదడుకు పదును పెడుతూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంటారు. గతంలో ప్రపంచం చూడని వింతలు, విచిత్ర వస్తువులను ఆవిష్కరిస్తారు. అలాంటి వాటిని చూసినపుడు మనం వారిని మెచ్చుకోకుండా ఉండలేము. గొప్ప ఇంజనీర్లు కూడా తికమకపడేలా భారతీయులు అనేక ట్రిక్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి గేమ్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆలోచనలో పడిపోతారు..

వైరల్‌ వీడియోలో ఆటోమేటిక్ మిషన్‌లా తయారు చేసిన ఒక కుండను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చాలా మంది వేసవిలో కుండ నీటిని తాగుతుంటారు. కుండలోని చల్లటి నీటిని తాగడం ద్వారా మీరు దాహం త్వరగా తీరుతుంది. ఇది ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఇటీవల అనేక రకాలైన మట్టి కుండలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని కుండలకు ప్రత్యేకించి కుళాయి ఏర్పాటు చేస్తున్నారు. అలా తయారు చేసిన వాటికి కొన్నిరోజుల తర్వాత కుళాయి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి దానికో జుగాఢ్‌ చేశాడు. దీంతో మట్టి కుండల్లోంచి చేతితో, లేదంటే.. కుళాయి సహాయంతో నీటిని తోడే అవాంతరం తొలగిపోయింది. ఇక్కడ మట్టి కుండను ఆటోమేటిక్‌గా మార్చేశాడు.

మట్టి కుండకు కొన్ని వైర్లు మోటార్‌ను అమర్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీరు నీళ్లు తాగేందు కోసం గ్లాస్‌ పట్టుకుని మట్టి కుండకు అమర్చిన పైప్‌ దగ్గరికి తీసుకెళ్తే చాలు.. కుండలోని నీరు ఆటోమేటిక్‌గా మీ గ్లాస్‌లోకి వచ్చేస్తుంది. ఈ వీడియో చూసిన యూజర్లు షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేలల్లో లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు.

కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. మట్టి కుండను ఆటోమేటిక్‌గా తయారు చేయడం కోసం ఉపయోగించిన వస్తువులు..ఆ కుండ కంటే ఖరీదైనవి అంటున్నారు. కానీ, చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..