Video: లిఫ్ట్‌లో గలీజ్‌ వాసన.. ఏంటా అని CCtv ఫుటేజ్‌ చెక్‌ చేయగా! బయటపడిన డెలవరీ బాయ్‌ భాగోతం

ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చేయకూడని పని చేశాడు. ఈ ఘటనతో అతనిపై కేసు నమోదైంది. నివాసితులు లిఫ్ట్‌లో వాసన రావడంతో సీసీటీవీ చెక్ చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్ల పరిస్థితులపైనా చర్చ జరుగుతోంది.

Video: లిఫ్ట్‌లో గలీజ్‌ వాసన.. ఏంటా అని CCtv ఫుటేజ్‌ చెక్‌ చేయగా! బయటపడిన డెలవరీ బాయ్‌ భాగోతం
Delivery Boy Urinates In Li

Edited By:

Updated on: Jul 22, 2025 | 5:05 PM

కొన్ని చోట్ల చూసే ఉంటారు.. ఇచ్చట మూత్రం పోయరాదు అని గోడలపై రాసి ఉంటుంది. అయినా కూడా కొంతమంది అలా గోడకు ఆనించి కానిచ్చేస్తుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఈ ధోరణి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పబ్లిక్‌ టాయిలెట్లు ఉన్నా కొంతమంది వాటిని వాడకుండా.. గోడల పక్కన పోసేస్తుంటారు. అయితే ఇక ఇప్పటి నుంచి లిఫ్ట్‌లో కూడా ఇచ్చట మూత్రం పోయరాదు అని రాయాలేమో.. అందుకే కారణం కానీ ఓ డెలవరీ బాయ్‌ చేసిన పనే. ఏకంగా లిఫ్ట్‌లోనే అతను ఆ పని చేశాడు. మరీ ఎంత అర్జెంట్‌ అయినా.. ఇలా లిఫ్ట్‌లో మూత్రం పోయడంపై నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబైలోని విరార్ వెస్ట్‌లోని ఒక భవనంలోని లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలతో బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌పై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత భవనం నివాసితులు ఈ సంఘటనను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో డెలివరీ బాయ్‌ ఎడమ చేతిలో పార్శిల్ పట్టుకుని లిఫ్ట్ లోపల కనిపించాడు. అతను వెనుక కెమెరా నుండి తన చర్యను దాచడానికి ప్రయత్నిస్తూ, ఒక మూలలో తన ప్యాంటు జిప్ విప్పాడు. ఆ తర్వాత అతను లిఫ్ట్ ముందు గేటుపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించారు. ముంబైలోని విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ భవనంలో ఈ సంఘటన జరిగింది.

భవనంలోని నివాసితులు లిఫ్ట్‌లో వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది, బ్లింకిట్ జాకెట్ ధరించిన వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఇది స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటన తర్వాత నివాసితులు బ్లింకిట్ కార్యాలయంలో ఆ డెలవరీ ఏజెంట్‌తో గొడవ పడి అతన్ని కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

అయితే అతను చేసింది తప్పే అయినప్పటికీ.. ఎంత అర్జెంట్‌ అయి ఉంటే ఆ పని చేశాడో కూడా ఆలోచించాలని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. డెలవరీ బాయ్‌లను కొంతమంది కనీసం మనుషుల్లా కూడా చూడరని, డెలవరీకి లేట్‌ అయితే కోప్పడుతూ ఉంటారని, గంటల కొద్ది డెలవరీలు ఇస్తూ క్షణ తీరిక లేకుండా గడుపుతుంటారని అంటున్నారు. వారి కోసం కంపెనీలు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. పైగా పెద్ద పెద్ద అపార్టెమంట్స్‌లో వాళ్లు సెక్యూరిటీ వద్ద సంతకాలు పెట్టి, బైక్‌ ఎక్కడో పార్క్‌ చేసి, కొన్ని అంతస్థులు వెళ్లి డెలవరీ ఇవ్వాలి. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా వాళ్లుకు ఒక్కొసారి టైమ్‌ ఉండదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి