తస్మాత్‌ జాగ్రత్త..! గంటల తరబడి పబ్జీ ఆడిన యువకుడికి పక్షవాతం.. నడవలేని స్థితిలో ఇలా ఆస్పత్రిలో..

ప్రస్తుతం చాలా మందికి పబ్జీ గేమ్ అనేది ఒక వ్యసనంగా మారింది. అలాంటి పబ్జీగా బానిసైన ఓ యువకుడు పక్షవాతంతో మంచం పట్టాడు. రోజుకు 12 గంటలు ఆటలు పబ్జీ ఆడటం వల్ల అతని వెన్నుముఖకు టీబీ సోకింది. అతనికి పాక్షిక పక్షవాతంతో పాటు నడవడం కూడా దూరమైంది. మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారడంతో చివరికి అతనికి వెన్నెముక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

తస్మాత్‌ జాగ్రత్త..! గంటల తరబడి పబ్జీ ఆడిన యువకుడికి పక్షవాతం.. నడవలేని స్థితిలో ఇలా ఆస్పత్రిలో..
Playing Pubg

Updated on: May 03, 2025 | 12:20 PM

పిల్లలలో పెరుగుతున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ అలవాటు వారిపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల, ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ప్రతిఒక్కరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసేలా ఉంది. అందరినీ ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ప్రస్తుతం చాలా మందికి పబ్జీ గేమ్ అనేది ఒక వ్యసనంగా మారింది. అలాంటి పబ్జీగా బానిసైన ఓ యువకుడు పక్షవాతంతో మంచం పట్టాడు. రోజుకు 12 గంటలు ఆటలు పబ్జీ ఆడటం వల్ల అతని వెన్నుముఖకు టీబీ సోకింది. అతనికి పాక్షిక పక్షవాతంతో పాటు నడవడం కూడా దూరమైంది. మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారడంతో చివరికి అతనికి వెన్నెముక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

దేశ రాజధానిలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు గంటల తరబడి పబ్జీ ఆడటం వల్ల పక్షవాతం వచ్చింది. రోజుకు 12 గంటల పాటు ఏకధాటిగా పబ్జీ ఆడటంతో అతడు నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. మూత్ర విసర్జన కూడా చేయలేకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పక్షవాతం వచ్చినట్లు చెప్పారు. ఏడాది కాలంగా అతడు ఎక్కడికీ వెళ్లకుండా ఒంటరిగా గదిలోనే ఉంటూ ఎప్పుడూ పబ్జీలోనే మునిగిపోయేవాడని కుటుంబ సభ్యుల ద్వారా వైద్యులు తెలుసుకున్నారు. రోజులో 12 గంటలపాటు అతడు పబ్‌జీ ఆడుతున్నట్లు తెలిసి డాక్టర్లే షాక్ అయ్యారు.

అతడికి పాక్షికంగా పక్షవాతం వచ్చినట్టుగా గుర్తించిన వైద్యులు అతనికి వెంటనే సర్జరీ నిర్వహించారు. అధునాతన నావిగేషన్ టెక్నాలజీతో స్పైన్‌కు సర్జరీ చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, అతడి ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు. బాధితుడు బాగా స్పందించాడని డాక్టర్లు వెల్లడించారు. అయితే, మితిమీరిన మొబైల్‌ గేమింగ్ వల్ల అతడు కైఫో- స్కోలియోటిక్ వెన్నెముక వైకల్యానికి గురయ్యాడని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్‌ఐసీ) తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో వెన్నెముక ముందుకు, లేదంటే పక్కలకు వంగి పోయి ఉంటుందని చెప్పారు. బాధిత యువకుడి MRI స్కాన్‌లో వెన్నెముకలోని రెండు ఎముకలు (D11 మరియు D12) TB బారిన పడ్డాయని, చీము పేరుకుపోయి వెన్నుపాముపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..