Spider Man Viral Video: స్పైడర్ మాన్.. సినిమాలు చూసే ఉంటారు.. దానిలో హీరో సాలీడులా దూసుకెళ్తుంటాడు.. ఆపదలో ఉన్న వారిని సెకన్లలోనే కాపాడుతాడు.. ఏదిఏమైనా అది మంచి సినిమానే.. కానీ.. సినిమాల్లో చూసేదంతా నిజం కాదని అర్ధం చేసుకోవాలి.. అయితే.. అచ్చం అలాంటి డ్రెస్ వేసిన ఓ యువకుడు.. తాను కూడా స్పైడర్ మాన్ లా రీల్ చేసి.. ట్రెండ్ అవుదామనుకున్నాడు.. అచ్చం అలాంటి డ్రెస్ వేశాడు .. స్పైడర్‌మ్యాన్ పాత్రలో లీనమై.. కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని హీరోలా రీల్ చేశాడు. సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.. ఇంకేముందు దీనిపై స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి పంపడంతోపాటు భారీ జరిమానా విధించారు.
ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్ వేషధారణలో ఓ వ్యక్తి కారు బానెట్‌పై ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించిన డ్రైవర్.. వ్యక్తికి భారీ జరిమానా విధించారు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK
— ANI (@ANI) July 24, 2024
ద్వారకా రోడ్లపై కదులుతున్న కారు బానెట్‌పై స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తిపై సోషల్ మీడియాలో ఫిర్యాదు రావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తిని నజఫ్‌గఢ్‌కు చెందిన ఆదిత్య (20)గా గుర్తించారు. కారు డ్రైవర్‌ను మహవీర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న గౌరవ్ సింగ్ (19)గా గుర్తించారు.
ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిపై వాహన యజమానులు, డ్రైవర్లపై గరిష్టంగా రూ.26,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..