Viral Video: మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్..! వైరలవుతున్న వీడియో..

|

Sep 24, 2023 | 4:12 PM

మెట్రోలో ఇలాంటి చిత్ర విచిత్ర స్టంట్‌లు, రీల్స్‌ చేయడం, వీడియోలను నిషేధిస్తూ.. ఢిల్లీ మెట్రో కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ ఇలాంటి వాళ్లు చాలా మంది సోషల్ మీడియా యూజర్లు వీడియోలు, రీల్స్‌ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ సంఘటనతో.. బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యేకించి ఢిల్లీ మెట్రో వంటి రద్దీగా ఉండే, వేగంగా వెళ్లే ప్రదేశాలలో విన్యాసాలు, స్టంట్లు చేసేందుకు ప్రయత్నించడం వల్ల ఇలాంటి నష్టాలే ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Viral Video: మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి  మైండ్‌బ్లాక్..! వైరలవుతున్న వీడియో..
Delhi Metro
Follow us on

గత కొన్ని నెలలుగా ఢిల్లీ మెట్రో ప్రతినిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలస్తుంది. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక రకాల వార్తలు అటు ఇంటర్‌ నెట్‌లోనూ వైరల్‌ అవుతున్నాయి. ఢిల్లీ మెట్రోలో గొడవలు, కుమ్ములాటలు, ఆడవాళ్ల సిగపట్లు, యువతీ యువకుల రోమాన్స్‌కు సంబంధించి అనేక రకాలైన వీడియోలు ఇప్పటి వరకు మనం చూశాం. అయితే, ఈసారి ఓ కుర్రాడు సోషల్ మీడియా కోసం వీడియో తీస్తూ విఫలమయ్యాడు.. అతడి ఫెల్యూర్‌ను కూడా వీడియో తీసిన మరో యూజర్ దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ఇప్పుడు అది శరవేగంగా షేర్ అవుతూ విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఢిల్లీ మెట్రో లోపల ఒక వ్యక్తి బ్యాక్‌ఫ్లిప్ చేయబోయి బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘటన ఓ యూజర్ కెమెరాలో బంధించగా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది.

బ్యాక్‌ఫ్లిప్ ఫ్లాప్ వీడియో వైరల్‌..

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ‘చమన్ ఫ్లిప్పర్’లో షేర్ చేయబడిన ఈ వీడియోలో మెట్రోలో తోటి ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి బ్యాక్‌ఫ్లిప్ చేసేందుకు రెడీ అయ్యాడు. మెట్రో ట్రైన్‌లోపల ఖాళీ స్థలం చూసుకుని.. అదే తన ప్రదర్శనకు ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించుకున్నాడు. సరైన యాంగిల్‌ చూసుకుని బ్యాక్‌ప్లిప్‌ ప్రయత్నించాడు..కానీ, పాపం అతడు పట్టుకోల్పోయాడు..దాంతో బలంగా కిందపడిపోయాడు.. మాడుకు భరించలేని దెబ్బ తగిలిందని అతడు పడుతున్న ఇబ్బంది చూస్తే అర్థమవుతుంది. మెట్రోలో ఇలాంటి చిత్ర విచిత్ర స్టంట్‌లు, రీల్స్‌ చేయడం, వీడియోలను నిషేధిస్తూ.. ఢిల్లీ మెట్రో కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ ఇలాంటి వాళ్లు చాలా మంది సోషల్ మీడియా యూజర్లు వీడియోలు, రీల్స్‌ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

ఈ సంఘటనతో.. బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యేకించి ఢిల్లీ మెట్రో వంటి రద్దీగా ఉండే, వేగంగా వెళ్లే ప్రదేశాలలో విన్యాసాలు, స్టంట్లు చేసేందుకు ప్రయత్నించడం వల్ల ఇలాంటి నష్టాలే ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. తోటి ప్రయాణీకుల భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఇలాంటి చర్యలపై జరిమానాలు ఎలా విధించాలని ప్రజలు సూచించారు. పుర్రె పగిలినా పగిలిపోతుంది..కానీ, ఇలాంటి వారిలో పిచ్చి తగ్గదు.. అని సోనూ అనే యూజర్ రాశాడు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..