Pole Dance Metro: ఢిల్లీ మెట్రోలో యువతుల రచ్చ.. మామూలుగా లేదు..! మీరూ చేసేయండి..

|

Jul 07, 2023 | 9:46 AM

మెట్రోలో వాదించుకోవడం, కొట్లాడుకోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూసే వారిని మీరు చూసారు. పోల్ డ్యాన్స్ మాత్రమే మిగిలింది! ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ పనిని కూడా పూర్తి చేసారు. ఇక ఇదే వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో విపరీతంగా హల్చల్ చేస్తోంది..

Pole Dance Metro: ఢిల్లీ మెట్రోలో యువతుల రచ్చ.. మామూలుగా లేదు..! మీరూ చేసేయండి..
Pole Dance Metro
Follow us on

ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో కొత్త వీడియో తెరపైకి వచ్చింది. ఇది చూసిన ప్రజలు తలలు పట్టుకున్నారు. ఈ సారి ఇద్దరు మహిళలు మెట్రో కోచ్‌లో పోల్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రయాణికుల కారణంగా ఢిల్లీ మెట్రో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో అన్ని రకాల పనులకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. మెట్రోలో చాలా మంది ప్రయాణికులు తమ ఇంట్లో చేసే పనులు, వీధుల్లో చేసే పనులన్నీ చేశారు. మెట్రోలో వాదించుకోవడం, కొట్లాడుకోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూసే వారిని మీరు చూసారు. పోల్ డ్యాన్స్ మాత్రమే మిగిలింది! ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ పనిని కూడా పూర్తి చేసారు, దీనిని చూసి కొంతమంది వినియోగదారులు మెట్రో ఇప్పుడు ఉచిత వినోద సాధనంగా మారిందని అంటున్నారు.

ఈ వీడియోను ‘హన్స్నా జరూరీ హై’ అనే పేజీ ద్వారా జూలై 6న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ముద్దులుపెట్టుకోవడం, పిడిగుద్దులతో కొట్టుకోవటం తర్వాత, ఇదిగో ఇప్పుడు పోల్ డ్యాన్స్ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌కు 61 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐదు వందలకు పైగా లైక్‌లు వచ్చాయి. వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ మెట్రోలో ఇదంతా ఎప్పుడు ఆగిపోతుందో తెలియటం లేదంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్‌ అంటూ మరికొందరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..