David Rush: ఒకటి, రెండు కాదు.. ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లు సాధించిన అమెరికన్..

ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒకే రోజులో ఏకంగా 15 గిన్నిస్ వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయాలను సందర్శించి ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 ఏకకాల మెడల్స్‌ను వేలం వేయడానికి వెళ్లాడు.

David Rush: ఒకటి, రెండు కాదు.. ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లు సాధించిన అమెరికన్..
David Rush

Updated on: Aug 10, 2024 | 9:36 PM

అమెరికాకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే వరుస రికార్డులు బ్రేక్‌ చేసిన వ్యక్తిగా కీర్తి గడించిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ మరోమారు తన సత్తా చాటుకున్నాడు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్.. ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒకే రోజులో ఏకంగా 15 గిన్నిస్ వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయాలను సందర్శించి ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 ఏకకాల మెడల్స్‌ను వేలం వేయడానికి వెళ్లాడు.

లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన డేవిడ్ రష్ తనవద్ద గల 180 శీర్షికలను వేలం వేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఒకే రోజు 15 రికార్డులు ఎలా బద్దలు కొట్టాడో ఆశ్చర్యంగా ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేత విల్ సిండెన్ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us