జీరో సైజ్‌ కోసం డేంజరస్‌ డైట్‌ను ఫాలో అయింది..! కట్‌ చేస్తే ICUలో కొన ఊపిరితో..

16 ఏళ్ల చైనా బాలిక, జీరో సైజు కోసం ప్రమాదకర డైట్‌ పాటించి ప్రాణాపాయంలో పడింది. రెండు వారాలు కూరగాయలు మాత్రమే తిని, ఆమె అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూలో చేరింది. 12 గంటల పోరాటం తర్వాత వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడారు.

జీరో సైజ్‌ కోసం డేంజరస్‌ డైట్‌ను ఫాలో అయింది..! కట్‌ చేస్తే ICUలో కొన ఊపిరితో..
Representative Image

Updated on: Jul 23, 2025 | 2:36 PM

అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కాలంలో జెండర్‌తో పని లేకుండా అందరూ అందంగా కనిపించేందుకు ప్రత్యేకమైన డైట్లు ఫాలో అవుతున్నారు. స్లిమ్‌గా కనిపించేందుకు ఆరాటపడుతున్నారు. ఇలానే ఓ 16 ఏళ్ల అమ్మాయి కూడా తన నెక్ట్స్‌ బర్త్‌డే లోపు జీరో సైజుకు వచ్చేయాలని ఓ డేంజరస్‌ డైట్‌ను ఫాలో అయింది. కానీ, ఇప్పుడా డైట్‌ ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక మెయి ‘జీరో ఫిగర్’ని పొందే ప్రయత్నంలో చాలా ప్రమాదకరమైన డైట్‌ను ఫాలో అయింది. దాని వల్ల ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితికి చేరింది. ఇప్పుడు ఆమె ఐసీయూలో ఉంది. తన పుట్టినరోజు నాటికి ‘సైజ్ జీరో’ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి మెయ్ రెండు వారాల పాటు ఉడికించిన కూరగాయలు మాత్రమే తిన్నది. మొదట ఆమె సరైన మార్గంలో ఉందని భావించింది, కానీ కొన్ని రోజుల్లోనే ఆమె శరీరం బలహీనపడింది. ఒక రోజు మెయ్ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని మూర్ఛపోయింది.

మృత్యువుతో 12 గంటల పోరాటం!

మెయిని అపస్మారక స్థితిలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడటానికి 12 గంటలు నిరంతరం పోరాడారు. మెయి శరీరంలో పొటాషియం పరిమాణం చాలా తగ్గిపోయిందని, ఆమె అవయవాలు పనిచేయడం మానేశాయని డాక్టర్లు తెలిపారు. అదృష్టవశాత్తూ.. వైద్యులు మెయి ప్రాణాలను కాపాడారు. ఈ భయానక అనుభవం తర్వాత నిపుణుల సలహా పాటించకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి డైట్లు ఫాలో అవ్వకూడదంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి