ఓ వ్యక్తి ఆకలేసి ముంబైలోని ఒక హోటల్‌కి వెళ్లాడు. తనకు ఎంతో ఇష్టమైన మసాలా దోశ ఆర్డర్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత వెయిటర్ తన ఆర్డర్ తీసుకుని వచ్చాడు. ఇక దాన్ని చూసి సదరు వ్యక్తి మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటారా.? అసలేం జరిగింది.? ఆ తర్వాత కస్టమర్ ఏం చేశాడో చూస్తే.. మీరు ఫిదా కావడం పక్కా..
వివరాల్లోకి వెళ్తే.. రామ్కీకి అనే వ్యక్తి ఆకలేసి ముంబైలోని కృష్ణఛాయా హోటల్‌కి వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాలా దోశ ఆర్డర్ పెట్టాడు. కాసేపటికి వెయిటర్ ఆర్డర్‌ను సదరు వ్యక్తి టేబుల్ దగ్గరకు తీసుకొచ్చాడు. ఇక దాన్ని చూసి రామ్కీ దెబ్బకు షాక్ అయ్యాడు. మసాలా దోశ ఆర్డర్ చేస్తే.. ఆ వెయిటర్ మసాలా వేరుగా.. దోశ వేరుగా సర్వ్ చేశాడు. అంతేకాదు.. రామ్కీకి ఆకలి వేసి.. అలాగే దోశను తినేశాడు. ఇక ఈ అనుభవాన్ని అతడు ట్విట్టర్‌లో నెటిజన్లతో పంచుకోగా.. మిగిలిన మసాలాను ఏం చేశారని అడిగాడు. ఏముంది ఇంటికొచ్చి.. తాను మసాలా దోశను వేసుకుని తిన్నానని పేర్కొన్నాడు.
”నేను ఒక ఫుడ్ బ్లాగర్‌ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. కానీ వాళ్లేమో దోసె విడిగా, మసాలా విడిగా సర్వ్ చేశారు. ఆ తర్వాత నేను దోసె తిన్నాను. మసాలాను ఇంటికి తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెట్టాను. నెక్స్ట్ రోజు ఆ దాచిన మసాలాతో నేను ఇంట్లో మసాలా దోసెలు వేసుకుని తిన్నాను. టెస్ట్ అదుర్స్.. ఓహోహో!” అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Main bhi food blogger.
I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms
— Ramki (@ramkid) March 19, 2023