
సాయంత్రం రద్దీగా ఉండే ఒక రోడ్డుపై ఉన్నట్టుండి ఒక వింత ఆకారం కదులుతూ కనిపించింది. రోడ్డు మధ్యలో భారీ శరీరంతో ఉన్న ఆ ఆకారాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. జూలై 18 గురువారం రాత్రి గుజరాత్‌లోని వడోదరలోని నరహరి విశ్వామిత్ర వంతెన సమీపంలోని ప్రధాన రహదారిపై ఇలాంటి షాకింగ్ సీన్ ఒకటి కలకలం రేపింది. రద్దీగా ఉండే ఆ రోడ్డుపై ఒక మొసలి కనిపించింది. విశ్వామిత్ర నది నుండి 8 అడుగుల పొడవైన మొసలి బయటకు వచ్చి రోడ్డు వెంట పరుగెత్తుతుండటం చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ రోడ్డుపై వెళ్తున్న కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. రద్దీగా ఉండే రోడ్డుపై క్షణాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కమిషనర్ బంగ్లా సమీపంలోనే ఉంది. అటవీ శాఖకు వెంటనే సమాచారం అందింది. హుటాహుటినా అటవీ శాఖ సిబ్బంది వచ్చి మొసలిని సురక్షితంగా రక్షించారు.
గురువారం రాత్రి, నరహరి విశ్వామిత్ర వంతెన రోడ్డు మీదుగా ఎనిమిది అడుగుల పొడవైన మొసలి పాకుతూ ఉండటం చూసి వడోదర నివాసితుల్ని షాక్‌కు గురిచేసింది. ఊహించని అతిథిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయంతో అలాగే నిలబడిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. చాలామంది ఆ క్షణాన్ని తమ ఫోన్‌లలో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
#Gujarat
An 8-foot crocodile blocked traffic on Narhari Vishwamitri Bridge Road on Thursdya Night. After much effort, the rescue team captured it and handed it over to the forest department. @NewIndianXpress @santwana99 @jayanthjacob #Vadodara #CrocodileRescue pic.twitter.com/Ck5fScHRcq— Dilip Kshatriya (@Kshatriyadilip) July 18, 2025
వైరల్ అయిన ఈ వీడియోలలో మొసలి రోడ్డు మధ్యలో ఆగి, అకస్మాత్తుగా జనం వైపు దూసుకుపోతూ, అరుస్తూ ఉన్న ప్రేక్షకులను భయపెట్టడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన విశ్వామిత్ర నదికి దూరంగా ఉన్న నరహరి ఆసుపత్రికి సమీపంలోని కమిషనర్ బంగ్లా సమీపంలో జరిగింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..