Viral Video: అడవి దున్నను వెంటాడి వేటాడిన మొసలి.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్.. చూస్తే షాకవుతారు!

అడవిలో చట్టాలు విభిన్నంగా ఉంటాయి. అక్కడ వేటాడితేనే బ్రతుకు పోరాటం జరుగుతుంది. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు..

Viral Video: అడవి దున్నను వెంటాడి వేటాడిన మొసలి.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్.. చూస్తే షాకవుతారు!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 18, 2021 | 10:21 AM

అడవిలో చట్టాలు విభిన్నంగా ఉంటాయి. అక్కడ వేటాడితేనే బ్రతుకు పోరాటం జరుగుతుంది. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు తరచూ వేటాడాలి. అలాగే సాధు జంతువులు ఎలప్పుడూ తమ తెలివిని ఉపయోగించి.. క్రూర జంతువుల నుంచి తప్పించుకుంటూ ఉండాలి. ఇదే అడవిలో మనుగడకు జీవనాడి.

మొసలిని ‘సముద్రపు అలెగ్జాండ‌ర్’ అని అంటుంటారు. నీళ్లలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందంటారు. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. ఇక మొసలి లాంటి క్రూర జంతువు వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన జాగాలోకి ఏ జంతువు వచ్చినా వదిలిపెట్టదు. మట్టుబెట్టి వేటాడేస్తుంది. అందుకే అంతటి బలశాలి అయిన మొసలికి చిక్కితే ప్రాణాలతో బయట పడటం అసాధ్యం అని అంటారు. తాజాగా ఓ మొసలి వేటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ నది ఒడ్డున ఆఫ్రికన్ అడవి దున్నల గుంపు సేద తీరుతూ నీటిని తాగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఎక్కడ నుంచి చూసిందో గానీ.. ఓ మొసలి వాటిని గమనిస్తుంది. అదును చూసి వాటిపై మెరుపు దాడికి దిగింది. మొసలి నుంచి కొన్ని అడవి దున్నలు తప్పించుకున్నా.. పాపం ఒకటి చిక్కుకుంటుంది. ఆ అడవి దున్నను మొసలి దాని పదునైన దవడలతో పట్టుకుని నీటిలోకి లాక్కుని వెళ్తుంది.

ఇదిలా ఉంటే మొసలికి చిక్కిన అడవి దున్న.. దాని నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. నొప్పితో విలవిలలాడిపోతుంది. మొసలి మాత్రం తన ఎరను తప్పించుకోకుండా గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని లాక్కుని నీటిలోకి తీసుకెళ్లి మెడను పట్టుకుంటుంది. అయితే ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురవుతుంది. ఆ కొలనులో ఉన్న మరికొన్ని మొసళ్లు.. ఆ ఎర కోసం దాని దగ్గరకు చేరుతాయి. ఒకదానితో మరోకటి పోరాటానికి దిగుతాయి. పాపం అడవి దున్న వీటి మధ్య తన ప్రాణాలను వదులుతుంది. కాగా, వీటికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీనిని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.