Viral Video: అడవి దున్నను వేటాడిన మొసలి.. క్షణాల్లో ప్రాణాలు తీసేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

|

Nov 17, 2021 | 9:25 PM

'ఐకమత్యమే మహాబలం'.. ఈ సామెత జంతు ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది. అడవిలో ఎప్పుడూ గుంపుతోనే కలిసుండాలి. ఎందుకంటే..

Viral Video: అడవి దున్నను వేటాడిన మొసలి.. క్షణాల్లో ప్రాణాలు తీసేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
Crocodile
Follow us on

‘ఐకమత్యమే మహాబలం’.. ఈ సామెత జంతు ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది. అడవిలో ఎప్పుడూ గుంపుతోనే కలిసుండాలి. ఎందుకంటే.. ఓ జంతువు గుంపుతో ఉన్నంత కాలం సురక్షితంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సమూహాన్ని విడిచి బయటికి వస్తుందో.. ఏదొక క్రూర జంతువుకు ఖచ్చితంగా ఆహారం అయిపోతుంది. మొసళ్లు చాలా తెలివైనవి, ప్రమాదకరమైనవి. వీటికి నీళ్లలో ఏ జంతువునైనా మట్టుబెట్టగలిగే శక్తి ఉంది. సముద్రపు అలెగ్జాండర్ అని పిలవబడే మొసలి నీటి అడుగున ఎంతో బలశాలి.. వెయ్యి ఏనుగుల బలం కలిగి ఉంటుంది. భారీ జంతువును సైతం క్షణాల్లో వేటాడి నమిలి మింగేస్తుంది. అంతటి బలశాలికి ఓ అడవి దున్న చిక్కింది. దాన్ని క్షణాల్లో నమిలి మింగేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. నది ఒడ్డున అడవి దున్నల గుంపు సేద తీరుతూ నీరు తాగుతోంది. సాధారణంగా నీళ్లలో దూరం నుంచి వేరే జంతువును చూస్తే చాలు.. మొసళ్లు అక్కడికి చేరుకుంటాయి. సరిగ్గా ఇదే సీన్ ఇక్కడా రిపీట్ అయింది. ఆ అడవి దున్నల దగ్గరకు ఓ మొసలి వచ్చింది. సరైనా సమయాన్ని చూసి గుంపుకు దూరంగా ఉన్న ఓ అడవిదున్నను క్షణాల్లో వేటాడి నీళ్లల్లోకి తీసుకెళ్లిపోయింది.

మొసలి నుంచి తప్పించుకునేందుకు ఆ అడవిదున్న శతవిధాల ప్రయత్నించింది. తనని తాను రక్షించుకునేందుకు ట్రై చేయగా.. చివరికి యుద్దంలో మొసలి పైచేయి సాధించగా.. అడవి దున్న ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఈ వీడియోను ‘World Of Wildlife And Village’ అనే యూట్యూబ్ ఛానెల్ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.