ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వరదలు కారణంగా పంట పొలాలు, లంక గ్రామాలు జలమయమవుతున్నాయి. అలాగే జంతువులు, విషసర్పాలు తమ ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. దీనితో ప్రజలు ఆందోళన చెందటం కామన్. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు చూద్దాం..
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందుకు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది కదా. మీరు ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడో లేకపోతే అందరూ కలిసి సరదాగా టీవీ చూస్తున్న టైంలోనో మీ ఇంట్లోకి నాగుపాము వస్తే.. ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి కదా. నిజంగా అలాగే జరిగింది. కుటంబసభ్యులంతా టీవీ చూస్తున్న సమయంలో ఓ భారీ నాగుపాము సరాసరి టీవీలో దూరిపోయింది. పామును చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలోని ఇందుపల్లిలో నవంబరు 22న ఓ ఇంట్లో భారీ నాగుపాము చొరబడింది. పామును చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో పాము సరాసరా వెళ్లి టీవీలో దూరిపోయింది. ఆ విషసర్పం ఎప్పుడు.? ఎవరి మీదకు వస్తోందో భయపడిన ఆ కుటుంబం.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. దీనితో అతడు అక్కడికి చేరుకొని ఎంతో చాకచక్యంగా పామును డబ్బాలో బంధించి జనావాసాలకు దూరంగా విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.