ఎయిర్‌లిఫ్ట్ సమయంలో ఒక ఆవు గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. కెమెరాలో చిక్కిన ఈ ఘటన మొత్తం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియోలో ఆవు చాలా ప్రశాంతంగా రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆ ఆవు ఏమాత్రం భయపడలేదు. తనను తాను విడిపించుకోవడానికి, భయపడుతూ పరిగెత్తేందుకు కష్టపడలేదు. ఆ ఆవును విమానంలో పర్వతంపైన దింపుతున్నట్లు వీడియోలో కనిపించింది. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆవును ఇలా గాలిలో ఎగిరించటం వెనుక కారణం మరోకటి ఉంది.. అది తెలిస్తే.. భావోద్వేగానికి లోను కావాల్సిందే.. ఆవును చికిత్స నిమిత్తం ఇలా తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk
ఇవి కూడా చదవండి— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024
వీడియోలో, ఒక ఆవు తాడుకు కట్టి హెలికాప్టర్‌కు వేలాడదీసి తీసుకెళ్తున్నారు. అది కొండల మధ్యలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. పర్వతాల్లో చిక్కుకుపోయిన ఆవుల ప్రాణాలను కాపాడేందుకు ఇంతకుముందు చాలాసార్లు హెలికాప్టర్లను ఉపయోగించారు. అంతే కాకుండా గాయపడిన పశువులను చికిత్స కోసం తీసుకెళ్లేందుకు ఈ మార్గాన్ని చాలాసార్లు అవలంబించారు. @AMAZlNGNATURE అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 27.3 మిలియన్ల మంది వీక్షించగా, వీడియోను చూసిన యూజర్లు దీనికి భిన్నమైన రియాక్షన్‌లు ఇస్తున్నారు.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ వైరల్ వీడియోలో ఆవు గాలిలో ఎగురుతూ కనిపించడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా ఆకాశంలో ఎగురుతున్న ఆవును చూసి సోషల్ మీడియా యూజర్లు కూడా రకరకాలుగా రియాక్షన్స్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..