
నేటి కాలంలో రీల్ అంటే కొంతమంది పిచ్చి పట్టినట్లు పట్టింది. దాని కోసం ఏదైనా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, దాని కోసం ప్రజలు తమ ప్రాణాలను కూడా పట్టించుకోరు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక జంట రీల్ పిచ్చిలో ఎవరూ ఊహించని పనిచేసింది. ఆ వీడియో చూసి, వాళ్లు రీల్స్ పిచ్చి చూసి నెటిజన్లు పిచ్చి తిట్లు తిడుతున్నారు.
స్టంట్ చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటంటూ మండిపడుతున్నారు. వీడియోలో ఒక జంట కాలువ ఒడ్డున నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడి ప్రవాహాన్ని చూస్తే ఒక్క క్షణం భయపడతారు, కానీ వాళ్ళు వీడియోలు తీయడానికి ఎంత పిచ్చిగా ఉన్నారంటే ఒకరినొకరు కౌగిలించుకొని నేరుగా నదిలోకి దూకుతారు. ఈ వీడియోను @imnatasha09 అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు.
ना लाईफ की फिकर
ना पानी का डर..
बस Reels बननी चाहिए सर! 😒 pic.twitter.com/fsbkGXO29X— Natasha Yadav (@imnatasha09) August 8, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి