Viral: అట్టాంటి.. ఇట్టాంటి దొంగతనం కాదు.. రెస్టారెంట్‌కి వెళ్లి మీల్స్ ఆర్డర్ ఇచ్చారు.. సీన్ కట్ చేస్తే..

సినిమాల్లో దొంగల స్టైల్ మీరు చూసే ఉంటారు.. అయితే అది రీల్.. కానీ రియల్‌గా దొంగలు చాలా తెలివి మీరిపోతున్నారు..

Viral: అట్టాంటి.. ఇట్టాంటి దొంగతనం కాదు.. రెస్టారెంట్‌కి వెళ్లి మీల్స్ ఆర్డర్ ఇచ్చారు.. సీన్ కట్ చేస్తే..
Representative Image

Updated on: Mar 11, 2023 | 10:14 AM

సినిమాల్లో దొంగల స్టైల్ మీరు చూసే ఉంటారు.. అయితే అది రీల్.. కానీ రియల్‌గా దొంగలు చాలా తెలివి మీరిపోతున్నారు. వారి దృష్టిలో దొంగతనం ఒక కళ. 64 కళల్లో అందరికీ సాధ్యం కాని అద్భుతమైన కళ అని భావిస్తుంటారు. పైగా, చేసేది పాడుపని.. కానీ దాన్ని కూడా పద్దతిగా చేయాలనుకుంటారు. సరిగ్గా ఇందుకు నిదర్శనంగా నిలుస్తూ.. ఓ జంట దొంగతనం చేశారు. సీన్ కట్ చేస్తే.. చివరికి ఊసలు లెక్కపెట్టారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌లోని ఓ రెస్టారెంట్‌కి ఒక జంట వచ్చారు. వీరు ఏకంగా 14 కోర్స్ భోజనాన్ని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇద్దరూ పైకి ఈ ఆర్డర్ పెట్టినా.. వాళ్లిద్దరూ మనీ హెయిస్ట్ మాదిరిగా ఓ పెద్ద దొంగతనానికి ప్లాన్ చేశారు. రెస్టారెంట్ సిబ్బంది పార్శిల్స్ కట్టే పనిలో ఉండగా.. ఈ జంట ఏకంగా 1.6 మిలియన్ యూరోస్ విలువ చేసే 45 వైన్ బాటిల్స్‌ను చక్కగా ప్యాక్ చేసి.. బ్యాగ్‌లో పెట్టి నీట్‌గా దొంగలించేశారు. కేవలంలో సెకన్ల వ్యవధి వాళ్లిద్దరూ ఈ దొంగతనం చేయగా.. కేవలం 4 వారాల్లోనే వారిని పోలీసులు పట్టుకున్నారు. కాగా ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటు చేసుకుంది. దీనిపై కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఇక ఈ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.