Viral News: ద్యావుడా..! ఎంగేజ్ మెంట్‌లో విందు కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్.. నెట్టింట పోస్ట్ వైరల్..

|

Aug 08, 2024 | 9:00 AM

ఒకప్పుడు సంతోషంగా గడపడానికి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లడం, భోజనం చేయడం చేసేవారు. అయితే ఇప్పుడు అటువంటివి మర్చిపోయారు. ఆన్‌లైన్‌లో మాత్రమే ఆహారాన్ని ఆర్డర్ చేసే పరిస్థితి కొనసాగుతోంది. అందుకనే రోజు రోజుకీ ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల క్రేజ్ పెరిగిపోతుండడానికి ఇదే కారణం. అయితే ప్రస్తుతం ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక జంట వారి నిశ్చితార్థం కోసం స్విగ్గీ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసారు.

Viral News: ద్యావుడా..! ఎంగేజ్ మెంట్‌లో విందు కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్.. నెట్టింట పోస్ట్ వైరల్..
Viral News
Follow us on

ప్రస్తుతం పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆన్‌లైన్ ఫుడ్ అంటే ఇష్టపడుతున్నారు. రోజు రోజుకీ ఈజీగా తినొచ్చు అంటూ ఆన్ లైన్ ఫుడ్ పట్ల క్రేజ్ ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు సంతోషంగా గడపడానికి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లడం, భోజనం చేయడం చేసేవారు. అయితే ఇప్పుడు అటువంటివి మర్చిపోయారు. ఆన్‌లైన్‌లో మాత్రమే ఆహారాన్ని ఆర్డర్ చేసే పరిస్థితి కొనసాగుతోంది. అందుకనే రోజు రోజుకీ ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల క్రేజ్ పెరిగిపోతుండడానికి ఇదే కారణం. అయితే ప్రస్తుతం ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక జంట వారి నిశ్చితార్థం కోసం స్విగ్గీ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసారు.

వైరల్ అవుతున్న ఈ కథనాన్ని @shhuushhh_ అనే ఖాతా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసింది. స్విగ్గీ డెలివరీ యాప్ ద్వారా తన నిశ్చితార్థం కోసం ఒక జంట ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. సోషల్ మీడియా పేజీ X లో ఆ ఫోటోలు కూడా పంచుకున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు జనాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ రెండు లక్షల మందికి పైగా చూశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ పోస్ట్ చూడండి

వైరల్ అవుతున్న ఈ చిత్రంలో స్విగ్గీ డెలివరీ బాయ్ టెంట్ కింద ఉన్న టేబుల్‌పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్‌లను వరసగా పెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. , సుస్మిత అనే నెటిజన్ ఈ ఫోటోని షేర్ చేస్తూ.. నిశ్చితార్థ వేడుక కోసం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఎప్పుడైనా మీరు చూశారా.. నేను చూశాను.. అనే కామెంట్ ను జత చేసింది. సుస్మిత చేసిన ఈ ట్వీట్‌పై స్పందించిన స్విగ్గీ.. వ్యక్తుల కంటే మా క్రేజీ డీల్స్‌ బెటర్‌ అని ఇకనుండి పెళ్లికి సంబంధించిన ఆహారాన్ని కూడా మా దగ్గరే ఆర్డర్ చేసుకొమంటూ సూచిస్తున్నారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ దీనిపై కామెంట్ చేస్తూ తమ స్పందనను తెలియజేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఇలా ఎంగేజ్‌మెంట్‌కి ఫుడ్‌ను ఎవరు ఆర్డర్ చేస్తారు, సోదరీ ?’ మరొకరు, ‘ఈ వ్యక్తులు స్వచ్ఛంద సంస్థ కోసం వారి QR కోడ్‌ను నమోదు చేసి ఉండాలి’ అని రాశారు. మరొకరు ఇలా రాశారు, ‘ఇలా వారి నిశ్చితార్థంలో భోజనం ఎవరు ఏర్పాటు చేస్తారు అంటూ చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

 

మరిన్ని టెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..