Corona Effect: ఓ తల్లి రూల్ బుక్.. అవాక్కైన బంధువులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..!

Corona Effect: తల్లి కావడం ప్రతి మహిళ(Woman) కల. ఒక మహిళ తల్లి(Mother) అయితే.. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.

Corona Effect: ఓ తల్లి రూల్ బుక్.. అవాక్కైన బంధువులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..!
Follow us

|

Updated on: Jan 26, 2022 | 5:49 PM

Corona Effect: తల్లి కావడం ప్రతి మహిళ(Woman) కల. ఒక మహిళ తల్లి(Mother) అయితే.. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డ(New Born) రక్షణకు సంబంధించిన అంశంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు. బిడ్డ సురక్షితంగా ఉండేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడదు ఆ తల్లి. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌(UK)లోని లండన్‌(London)లో నివసిస్తున్న లోలా జిమెనెజ్.. ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూసేందుకు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆసక్తి కనబరిచారు. అయితే, తన బిడ్డను చూసేందుకు వచ్చే అతిథుల కోసం ఆ తల్లి పెద్ద రూల్‌ బుక్‌ను సిద్ధం చేసి పెట్టింది. ఇంటికి వచ్చేవారెవరైనా.. ఈ నియమాలు పాటించాల్సిందేనంటూ కండీషన్స్ పెట్టింది.

కరోనా ప్రబలుతున్న సమయంలో లోలా తన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో బిడ్డను జాగ్రత్తగా కాపాడుకునేందుకు, బిడ్డకు కరోనా సోకకుండా ఉండేందుకే ఈ రూల్స్ సిద్ధం చేసింది. తన బిడ్డను చూడటానికి వచ్చే వారెవరైనా సరే ఈ రూల్స్ పాటించాల్సిందేనంటూ ఇంటి ముందు ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు.. ఆ నిబంధనల జాబితాను.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లోనూ పోస్ట్ చేసింది. తన బిడ్డను కరోనా నుంచి దూరంగా ఉంచేందుకు ఈ నియమాలని స్పష్టం చేసింది.

ఆమె రూపొందించిన రూల్ బుక్ ప్రకారం.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తప్ప మరెవరినీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ సమయంలో, ఇంటికి వచ్చే ఏ అతిథి అయినా తమ బూట్లు, పై దుస్తులను తొలగించాలి. అలాగే శానిటైజ్ చేసుకోవాలి. ఎవరైనా తన ఇంటికి వస్తే కరోనా పరీక్ష చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు, ఇంట్లో ధూమపానం కూడా నిషేధం. ఏ అతిథి కూడా పిల్లవాడి దగ్గరి రావడం గానీ, ముట్టుకోవడం గానీ, ముద్దు పెట్టుకోవడం గానీ కుదరదు.

Also read:

AP Corona Cases: ఏపీ ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. లక్ష దాటి టెన్షన్ పెడుతోన్న యాక్టివ్ కేసులు

Khiladi: రవితేజ ఖిలాడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్‏తో ఫుల్ కిక్కు అంటూ అదరగొట్టిన మాస్ మాహారాజా..

Viral Video: మెట్లను ఇలా కూడా దొగొచ్చా.. ఈ బుజ్జి కుక్క స్టైల్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు..