Khiladi: రవితేజ ఖిలాడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్‏తో ఫుల్ కిక్కు అంటూ అదరగొట్టిన మాస్ మాహారాజా..

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రవితేజ ప్రస్తుతం

Khiladi: రవితేజ ఖిలాడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్‏తో ఫుల్ కిక్కు అంటూ  అదరగొట్టిన  మాస్ మాహారాజా..
Full Kick Song
Follow us

|

Updated on: Jan 26, 2022 | 5:37 PM

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల నుంచి వరుస అప్డేట్స్‏తో ఫ్యాన్స్‏ను ఫుల్ ఖుషి చేస్తున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా… ఖిలాడీ (Khiladi).. రామరావు ఆన్ డ్యూటీ.. ధమాకా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత.. ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు రవితేజ. ఇదిలా ఉంటే.. ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా.. ఖిలాడి సినిమా నుంచి మరో స్పెషల్ ట్రీట్ వచ్చేసింది.

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఖిలాడి. ఈ చిత్రాన్ని ఏ స్టూడియేస్, ఎల్ఎల్పీ బ్యానర్లపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పాట పూర్తిగా మాస్ యాంగిల్‏లో ఉంది. అలాగే మరోసారి రవితేజ తన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. అర్జున్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..

Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..

Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..