చైనా వాల్‌కే కన్నం వేసిన కూలీలు.. ప్రయాణ దూరం తగ్గుతుందని అడ్డదారి వేసుకున్నారు..

|

Sep 13, 2023 | 8:43 PM

వారు తమ నిర్మాణ యంత్రాలు, ఇతర వస్తువులతో పనికి వెళ్లాలంటే.. చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని.. ఆ దూరాన్ని తగ్గించుకోవటానికి ఇలా గోడకు పెద్ద రంధ్రం తవ్వారు. ఎత్తైన చైనావాల్‌కు ఇద్దరు కార్మికులు కలిసి పెద్ద రంద్రం చేయటం అక్కడ హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.

చైనా వాల్‌కే కన్నం వేసిన కూలీలు.. ప్రయాణ దూరం తగ్గుతుందని అడ్డదారి వేసుకున్నారు..
Great Wall Of China Damaged
Follow us on

చాలా మంది ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించేకంటే..త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు, రెండు వీధుల చుట్టూ తిరిగే స్థలంలో కంచెతో కూడిన ఖాళీ స్థలం ఉంటే, కొందరు వ్యక్తులు దాని గుండా వెళ్ళడానికి కంచెలో కొద్దిగా గ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా ఎత్తుకు నిర్మించిన గోడను దాటి వెళ్ళడానికి దాదాపు ఎవరూ ప్రయత్నించరు. కానీ, కొందరు వ్యక్తులు అలాంటి ఎత్తైన గోడలకు కూడా కన్నం షార్ట్‌కట్‌ ఏర్పాటు చేస్తారంటే మీరు నమ్మగలరా? అలాంటి ప్రయత్నమే చేశారు కొందరు వ్యక్తులు. యునెస్కో వారసత్వ చిహ్నాలలో ఒకటైన చైనా గ్రేట్ వాల్‌కు కొందరు భవన నిర్మాణ కూలీలు పెద్ద రంధ్రం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో అందరూ షాక్‌ ఆశ్చర్యపోతున్నారు.

పురాతన చైనా రక్షణ గోడ నేటికీ మనుగడలో ఉన్న గొప్ప సంపదగా పరిగణించబడుతుంది. ఈ స్థితిలో చైనాలోని గ్రేట్ వాల్ దగ్గర క్రాస్ రోడ్డు వేయాలనే ఉద్దేశంతో కొందరు డ్రిల్‌ చేశారు. ఎత్తైన చైనావాల్‌కు ఇద్దరు కార్మికులు కలిసి పెద్ద రంద్రం చేయటం అక్కడ హాట్ హాట్ గా చర్చిస్తున్నారు. 38 ఏళ్ల ఇద్దరు కార్మికులు, 55 ఏళ్ల ఓ మహిళా కార్మికురాలు కలిసి ఈ విధ్వంసక పని చేశారు. వారు తమ నిర్మాణ యంత్రాలు, ఇతర వస్తువులతో పనికి వెళ్లాలంటే.. చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని.. ఆ దూరాన్ని తగ్గించుకోవటానికి ఇలా గోడకు పెద్ద రంధ్రం తవ్వారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కొనసాగింపును మింగ్ గ్రేట్ వాల్ అంటారు. ఇది శతాబ్దాల క్రితం మింగ్ రాజవంశం సమయంలో నిర్మించబడినందుకు ఈ పేరు పెట్టారు. ఈ మింగ్ సామ్రాజ్యం పాలన 1,368 నుండి 1644 AD వరకు సాగింది. సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న ఈ గ్రేట్ వాల్‌కు కార్మికులిద్దరూ శాశ్వతంగా కోలుకోలేని నష్టాన్ని కలిగించారని పోలీసులు తెలిపారు.

అంతకుముందు ఆగస్టు 24న గోడ ధ్వంసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. భారీ యంత్రాలతో గోడను డ్రిల్లింగ్‌ మిషన్స్‌తో రంద్రం చేసినట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సమీపంలో నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను విచారించగా నేరం అంగీకరించారు. దాంతో వారిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దాదాపు 20,000 కి.మీ. దూరంగా ఒక పెద్ద గోడ. పర్వతాలు, ఎడారులు, మైదానాలు వంటి విభిన్న భూభాగాలను దాటి, ఈ గోడ మానవజాతి చరిత్రలో గొప్ప కళాత్మక సంపదగా నిలిచిపోయింది. దీనిని 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..