Viral News: ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెల్లెళ్లు..! వీరిది ఒకే శరీరం, రెండు ముఖాలు.. హృదయం..?

|

Mar 31, 2024 | 5:38 PM

ఇద్దరూ 1990లో పుట్టారు. వీళ్లు పుట్టిన తరువాత కుటుంబం వీరికి ఆపరేషన్ నిర్వహించి ఇద్దరినీ విడదీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు వెల్లడించారు. సర్జరీ తర్వాత వారిద్దరూ బతికే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్ తెలిపారు. దాంతో శస్త్రచికిత్స చేయించాలనే నిర్ణయం వాయిదా పడిందని చెప్పారు.

Viral News: ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెల్లెళ్లు..! వీరిది ఒకే శరీరం, రెండు ముఖాలు.. హృదయం..?
Conjoined Twin Abby
Follow us on

1996లో ‘ది ఓప్రా విన్‌ఫ్రే షో'(The Oprah Winfrey Show) ద్వారా కవల సోదరీమణులు అబ్బి, బ్రిటనీ హెన్సెల్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఈ ఇద్దరు సోదరీమణులకు రెండు ముఖాలు ఉన్నాయి. కానీ, ఒకే గుండె, ఒకే శరీరం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు వారిద్దరూ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కవల సోదరీమణులు అబ్బి, బ్రిటనీ హెన్సెల్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ నుండి రిటైర్ అయిన జోష్ బౌలింగ్‌ను వివాహం చేసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఈ అక్కాచెల్లెళ్లు టీచర్లుగా పనిచేస్తూ ఐదో తరగతి వరకు పిల్లలకు బోధిస్తున్నారు. ఈ జంటకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

2021 సంవత్సరంలోనే ఈ సోదరీమణులిద్దరూ జోష్ బౌలింగ్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వెలుగులోకి వస్తు్న్నాయి. వీరి వివాహ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో సోదరీమణులిద్దరూ జోష్ బౌలింగ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మరో ఫోటోలో వారిద్దరూ తమ భర్తతో కలిసి సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ ఇద్దరు అక్కాచెల్లెల ప్రత్యేకత ఏంటంటే..ఏబీ, బ్రిటనీ హెన్సెల్ ఒకే శరీరం కలిగి ఉన్నారు. కానీ రెండు తలలు, రెండు ముఖాలను కలిగి ఉన్నారు. మెడ క్రింది అవయవాలన్నీ ఒకేలా ఉంటాయి. అబ్బి శరీరం, కుడి చేయి, కాలును నియంత్రిస్తుంది. బ్రిటనీ శరీరం ఎడమ భాగాన్ని నియంత్రిస్తుంది.

ఇద్దరూ 1990లో పుట్టారు. వీళ్లు పుట్టిన తరువాత కుటుంబం వీరికి ఆపరేషన్ నిర్వహించి ఇద్దరినీ విడదీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు వెల్లడించారు. సర్జరీ తర్వాత వారిద్దరూ బతికే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్ తెలిపారు. దాంతో శస్త్రచికిత్స చేయించాలనే నిర్ణయం వాయిదా పడిందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…