Viral: వధూవరులకు వెడ్డింగ్ కిట్స్ పంపిణీ.. ఓపెన్ చేయగా కనిపించినవి చూసి కళ్లు బైర్లు.!

|

May 31, 2023 | 9:09 AM

పెళ్లిళ్లకు వెళ్లే చాలామంది డబ్బులు, లేదా ఏదైనా అవసరమయ్యే వస్తువులు.. కొత్తగా పెళ్ళైన జంటలు ఇలాంటివి బహుమతులుగా ఇస్తుంటారు.

Viral: వధూవరులకు వెడ్డింగ్ కిట్స్ పంపిణీ.. ఓపెన్ చేయగా కనిపించినవి చూసి కళ్లు బైర్లు.!
Viral
Follow us on

పెళ్లిళ్లకు వెళ్లే చాలామంది డబ్బులు, లేదా ఏదైనా అవసరమయ్యే వస్తువులను.. కొత్తగా పెళ్ళైన జంటలు ఇలాంటివి బహుమతులుగా ఇస్తుంటారు. ఎవ్వరూ కూడా రాజకీయ నాయకుల్లా ఫ్రీ హామీలు, షాక్‌కు గురి చేసే వస్తువులను ఇవ్వరు. అయితే ఇక్కడొక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా కొత్తగా పెళ్ళైన జంటలు కంగుతినేలా.. వారికి ఇచ్చే వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పెట్టి పంపిణీ చేసింది. వాటిని చూడగానే వధూవరులిద్దరూ దెబ్బకు బిత్తరపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఇదే అక్కడ హాట్ టాపిక్.

జాబువా జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఇచ్చిన వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉండటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం స్థానికంగా వివాదాస్పదమైంది. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆ కిట్లలో వాటిని పెట్టి ఉంటుందని జిల్లా సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, గతంలోనూ వధువులకు ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించడం.. పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా వధువుల సాధారణ వయస్సు తెలుసుకునేందుకు, వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారో లేదో తెలిసేందుకే ఈ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.