Viral: దరిద్రం లిప్‌కిస్ పెట్టడమంటే ఇదేనేమో.. రూ. 2.50 కోట్లు గెలిచాడు.. కానీ చిన్న పొరపాటుతో.!

|

May 03, 2023 | 9:21 AM

లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2.50 కోట్లు తగిలింది. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ మనోడికి అదృష్టం వచ్చి హాగ్ ఇచ్చేలోపు దరిద్రం లిప్‌కిస్ పెట్టేసింది.. అతడు చేసిన ఒక చిన్న పొరపాటుతో..

Viral: దరిద్రం లిప్‌కిస్ పెట్టడమంటే ఇదేనేమో.. రూ. 2.50 కోట్లు గెలిచాడు.. కానీ చిన్న పొరపాటుతో.!
Representative Image
Follow us on

అతడొక సామాన్యుడు.. రూ. 20లతో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఇక దానికి లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2.50 కోట్లు తగిలింది. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ మనోడికి అదృష్టం వచ్చి హాగ్ ఇచ్చేలోపు దరిద్రం లిప్‌కిస్ పెట్టేసింది.. అతడు చేసిన ఒక చిన్న పొరపాటుతో ఆ సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లే అవకాశం ఉందట. ఇంతకీ అతడు చేసిన పొరపాటు ఏంటి.? ఎందుకు ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుందని అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీలో తెలుసుకుందామా..!

వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని ఫజిల్క్ జిల్లాకు చెందిన సాక్ష్ అనే వ్యక్తికి లాటరీలో రూ. 2.50 కోట్ల జాక్‌పాట్ తగిలింది. కానీ అతడు చేసిన చిన్న పొరపాటు.. ఆ లాటరీ టికెట్‌పై తన చిరునామా, ఫోన్ నెంబర్ రాయడం మర్చిపోయాడు. దీంతో సదరు లాటరీ దుకాణ నిర్వాహకులు ఆ డబ్బును గెలుచుకున్న వ్యక్తికి అందజేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అతడి జాడ మాత్రం ఎంత వెతికినా దొరకట్లేదట. ఒకవేళ ఎంతకీ ఆ వ్యక్తి జాడ దొరక్కపోతే.. డబ్బు చివరికి ప్రభుత్వానికి చెందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా లాటరీని కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరైనా కూడా తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సాక్ష్ అనే వ్యక్తి తన దగ్గర లాటరీ టికెట్ కొనుగోలు చేశాడని.. లక్కీ డ్రాలో రూ. 2.50 కోట్లు గెలుచుకున్నాడని సదరు లాటరీ దుకాణదారుడు బాబీ జవేజా తెలిపాడు. అయితే అతడు ఫోన్ నెంబర్, అడ్రస్ లాంటివి ఏవి కూడా ఇవ్వలేదని.. అయినప్పటికీ అతడి జాడ కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాడు. *****92 ఈ నెంబర్‌తో లాటరీ గెలుచుకున్న వ్యక్తి.. డబ్బు క్లెయిమ్ చేసుకునేందుకు రూప్ చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలని బాబీ స్థానికులకు విజ్ఞప్తి చేశాడు. లాటరీ టికెట్ కొనుగోలు చేసే సమయంలో పేరుతో పాటు ఫోన్ నెంబర్, అడ్రస్ లాంటివి రాస్తే.. సులువుగా విజేతలను సంప్రదించే అవకాశం ఉంటుందని అతడు వెల్లడించాడు. కాగా, లాటరీ గెలుచుకున్న విజేత పూర్తి వివరాలు ఇవ్వలేకపోయినా.. లక్కీ డ్రా సమయంలో డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి రాకపోయినా.. ఇలా కారణం ఏదైనా ఆ డబ్బు నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుందని అక్కడి అధికారులు అంటున్నారు.