Yoga Snake: ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇక సనాతన భారతీయ సంప్రదాయంలోని యోగా కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యోగాలోని ఒక్కో భంగిమ.. శారీరక సమస్యలన్నింటినీ తొలగిస్తాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా యోగాలో ప్రాణయామం ఎంతో కీలకమైనది. ఒక వ్యక్తి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, నిశ్చలమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, మనసు నిశ్చలంగా ఉండాలన్నా, ఒత్తిడి సమస్య తొలగిపోవాలన్నా ఆయుర్వేదం నిపుణులు మొదలు, శాస్త్రీయ వైద్యుల వరకు అంతా యోగాలోని ప్రాణయామాన్ని రిఫర్ చేస్తుంటారు. ఉదయాన్నే ప్రాణయామం చేయడం ద్వారా మనస్సు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. అయితే, ప్రాణయామాన్ని ఇప్పటి వరకు మనుషులు మాత్రమే చేయడాన్ని చూశాం. మరి జంతువులు, సరిసృపాలు కూడా ప్రాణయామం చేయడం చూశారా? పోనీ దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడైనా విన్నారా? అయితే, ఇప్పుడు వినడమే కాదు.. ఏకంగా చూసేయండి.
అవును.. ఓ నాము విశాలమైన మైదానంలో ప్రశాంతంగా పడగవిప్పి ఉంది. అందమైన సూర్యోదయాన ఆ పాము సూర్యుని వైపు వీక్షిస్తూ.. ప్రాణయామం చేస్తోంది. ఊపిరి పీల్చుకుంటూ, వదులుతూ చాలా సేపు ఆ పాము ప్రాణయామం చేసింది. అయితే, పాము ప్రాణయామం చేయడాన్ని ఓ ఫోటోగ్రాఫర్ సాహసం చేసి మరీ కెమెరాలో చిత్రీకరించాడు. ప్రాణయామం చేసినంత సేపు ఆ పాము.. కెమెరానే చూస్తూ ఉండింది తప్ప.. ఏలాంటి హానీ తలపెట్టలేదు. దీనికి సంబంధించి షాకింగ్ వీడియోను ఐఎస్ఎఫ్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. పాము ప్రాణయామం చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ బ్యూటీఫుల్ వీడియోపై ఓ లుక్కేయండి.
#Cobra Doing Pranayama?! ??
Amazing video capture by expert wildlife photographer Dr S Varaprasad.
Received on Whatsapp. pic.twitter.com/pf0Ankb76F— Meghna Girish ?? (@megirish2001) April 29, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లింక్ చేయండి..
Also read:
F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్ సిద్ధం చేసిన ఎఫ్3 టీమ్.. పేలనున్న ఫన్ బాంబ్..