Vira Video: ఎవరెస్టు శిఖరంపైన ఎలా ఉంటుందో తెలుసా.. మైండ్ బ్లాకే..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది హిమాలయాల్లో ఉందని తెలుసు. ఈ శిఖరం పైకి ఎక్కేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆక్సిజన్ అందక చాలా మంది ఎక్కుతూ మధ్యలోనే వెనుదిరిగేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎలా ఉంటుందో.. దాని పైన ఎలా ఉంటుందో చూడాలని అందరికీ అనిపిస్తుంది. మీ ఆశ ఈ వీడియో తీర్చేస్తుంది. అంత గొప్పగా ఉంది ఈ వీడియో. అసలు ఈ వీడియో చూస్తుంటే..

Vira Video: ఎవరెస్టు శిఖరంపైన ఎలా ఉంటుందో తెలుసా.. మైండ్ బ్లాకే..
Viral Video

Updated on: Jul 15, 2024 | 3:21 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది హిమాలయాల్లో ఉందని తెలుసు. ఈ శిఖరం పైకి ఎక్కేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆక్సిజన్ అందక చాలా మంది ఎక్కుతూ మధ్యలోనే వెనుదిరిగేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎలా ఉంటుందో.. దాని పైన ఎలా ఉంటుందో చూడాలని అందరికీ అనిపిస్తుంది. మీ ఆశ ఈ వీడియో తీర్చేస్తుంది. అంత గొప్పగా ఉంది ఈ వీడియో. అసలు ఈ వీడియో చూస్తుంటే మైండ్ బ్లాక్ అయి పోతుంది.

నేపాల్ భూభాగంలో ఉన్న ఈ మౌంట్ ఎవరెస్ట్ శిరం ఎక్కాలని ప్రపంచ పర్వతారోహకుల చిరకాల కోరిక. అక్కడున్న ప్రతి కూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని శిఖరం చేరాలి అంటే మాటు కాదు. ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే అక్కడ అంతా ఎముకలు కొరికే చలి వాతావరణం ఉంటుంది. అంతే కాకుండా పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఊపిరి కూడా పీల్చుకోలేరు. తాగడానికి కూడా నీరు అందుబాటులో ఉండదు. దీంతో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కుదామని ట్రై చేసి.. మధ్యలోనే వెనుదిరుగుతూ ఉంటారు.

అయితే ఎవరెస్ట్ శిఖరం చూడాలి అనుకునేవారికి ఇప్పుడు ఆ ఆశ తీరిపోతుంది. చైనాకు చెందిన సంస్థ డ్రోన్ సహాయంతో ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్న అందాను వీడియోలో చిత్రీకరించింది. ఇప్పుడు ఈ వీడియోలో ఎవరెస్ట్ అందాలను చూడవచ్చు. అక్కడ డ్రోన్ పంపించడం కూడా మామూలు విషయం కాదు. మావిక్ 2 ప్రో డ్రోన్‌ను ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరంపై సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి.. ఈ వీడియో చిత్రీకరించింది సంస్థ. ఈ వీడియోలో ఎవరెస్ట్ ఎక్కుతున్న వారు. కిందకు దిగుతున్న సాహసికులను కూడా చూడవచ్చు

ఎవరెస్ట్ శిఖరాన్ని హత్తుకున్న మంచు, హిమానీ నదులు, శిఖరంపై అసలు ఎలా ఉంటుంది అంతా మీరు ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షేర్లు, కామెంట్లతో మోత మోగి పోతుంది. ఈ వీడియో చూశారంటే మీరు కూడా ఖచ్చితంగా షాక్ కి గురవ్వక తప్పదు. ఈ వీడియోలో మీరు కూడా లీనమైపోతారు. మరి ఎవరెస్ట్ శిఖరం అందాలను మీరు కూడా చూసేయండి.