Man Mum Culture: ఐదు నిమిషాల హగ్‌కు రూ.600..! ఆ దేశంలో కొనసాగుతున్న కొత్త ట్రెండ్!
Man Mum Culture: మీరు జిమ్‌కు వెళ్తున్నారా.. స్లిమ్‌గా అండ్ ఫిట్‌గా ఉన్నారా? అయితే మీ పంట పండినట్టే.. ఎందుకంటే మీరు కేవలం ఐదు నిమిషాల పాటు హగ్ ఇవ్వడం ద్వారా రూ.600 వరకు సంపాధించవచ్చు. వినడానికి ఇది వింతగా అనిపించినా నిజం.. ఒక దేశంలో ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఆదేశంలోని యూమ్ మొత్తం ఇప్పుడు ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. ఇంతకు ఈ ట్రెండ్ ఎలా పుట్టుకొచ్చింది.. హగ్ ఇస్తే డబ్బులు ఎందుకిస్తున్నారనే కదా మీ డౌట్.. అయితే తెలుసుకుందాం పదండి.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్‌గా మారినా.. అది క్షణాల్లో ప్రపంమంతా పాకేస్తుంది. అవి ఆటలైనా, అలవాట్లైనా, ఆచారాలైనా.. వాటిని జనాలు ఇట్టే ఫాలో అయిపోతారు. తాజాగా అలాంటి ఓ కొత్త ట్రెండ్‌కు చైనా యూత్ ఆజ్యం పోశారు. ‘మ్యాన్-మమ్’ అనే కొత్త ట్రెండ్‌ను ఆచరణలోకి తెచ్చారు. ఈ మ్యాన్-మన్ ప్రకారం.. యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకుంటారు. తర్వార వాళ్ల దయనందిన జీవితంలో ఉన్న ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్‌ను దూరం చేసుకుంటున్నారు.
రోజూవారి బిజీ లైఫ్‌లో జనాలతో మాట్లాడేందుకు సమయం లేక, ఎవరి పనుల్లో వారి బిజీ కావడంతో.. మాట్లాడే వారు లేక ఒంటరిగా ఫీలయ్యే మహిళలు, యువతులు ఎక్కువగా ఇలాంటి కౌగిలింతలు కోరుకుంటున్నారు. వారికి లోన్‌లీగా అనిపించినప్పుడు మ్యాన్-మామ్ పురుషుడు బుక్ చేసుకొని హగ్ చేసుకుంటారు. ఇందుకు కోసం ఆ పురుషుడికి( 20 నుంచి 50 యువాన్లు) అంటే మన ఇండియన్ రూపాయల్లో 250 నుంచి రూ.600 వరకు యువతులు చెల్లిస్తారు.
ఈ కొత్త ట్రెండ్ చైనా ప్రస్తుతం విపరీతంగా పెరుగుతోంది. అక్కడ నివసించే చాలా మంది యువతులు ‘మ్యాన్-మమ్స్’ పురుషులను హాగ్ చేసుకునేందుకు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. అయితే హగ్ చేసుకునేందుకు వచ్చే యువకులు కూడా బుక్ చేసుకున్న వారిని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. వారికి ఎలాంటి హానీ కలిగించకుండా పూర్తిగా సహకరిస్తారని చెబుతున్నారు. తద్వారా వాళ్లు ఎంతో ప్రశాంతతను పొందుతారని, ఎంతో రిలాక్స్‌గా ఫీల్ అవుతారని బెబుతున్నారు.
అసలు ఈ ట్రెండ్ ఎలా పుట్టుకొచ్చింది?
కొన్ని నివేదికల ప్రకారం.. జిమ్‌కు వెళ్లి, ఫిట్‌గా కనిపించే యువకులను సూచించేందుకు ఈ మ్యాన్-మమ్ అనే పదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలక్రమేనా.. దీని అర్థాన్ని అక్కడ యువత పూర్తిగా మార్చేశారు. మ్యాన్-మమ్ అంటే.. అమ్మలాంటి ప్రేమ, ఓర్పు కలిగిన వారిగా పిలవడం మొదలు పెట్టారు. అయితే డేయిలీ లైఫ్‌లో మానసిక ఒత్తిడికి గురైన ఒక యువతి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసుకుంది.. నా ఒత్తిడిని తగ్గించుకునేందుకు డబ్బులు చెల్లించి హగ్ ఓ వ్యక్తిని హగ్ చేసుకున్నట్టు తెలింది. ఈ హగ్ తర్వాత తాను ఎంతో రిలాక్స్ అయ్యానని పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. ప్రతి ఒక్కరు ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని మేము దృవీకరించట్లేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
