Viral Video: 45 సెకన్లలో 15 బిల్డింగ్‌లు కూల్చివేత..! ఆకాశాన్నంటే భవనాలు చూస్తుండగానే.. షాకింగ్‌ వీడియో..

|

Sep 17, 2021 | 6:40 PM

Viral Video: ఏదైనా పెద్ద భవనాన్ని కూల్చివేయాల్సివస్తే అందుకోసం చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రమాదం జరగకుండా

Viral Video: 45 సెకన్లలో 15 బిల్డింగ్‌లు కూల్చివేత..! ఆకాశాన్నంటే భవనాలు చూస్తుండగానే.. షాకింగ్‌ వీడియో..
China15 Sky Scrapers
Follow us on

Viral Video: ఏదైనా పెద్ద భవనాన్ని కూల్చివేయాల్సివస్తే అందుకోసం చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. చాలాసార్లు పేలుడు పదార్థాలతో కూడా భవనాలను కూల్చివేస్తారు. అయితే భవనం కూలిపోయే దృశ్యం భయపెట్టే విధంగా ఉంటుంది. కానీ ఒకేసారి 15 భవనాలు కూలిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చైనాలో సరిగ్గా ఇదే జరిగింది.15 భవనాలు ఒకేసారి కూలిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో15 భవనాలు కూల్చేశారు. 4.6 టన్నుల పేలుడు పదార్థాలను వినియోగించారు. కేవలం 45 సెకన్లలో 15 భవంతులు నేలకూలాయి. ఈ భవనాల కూల్చివేత సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుజాగ్రత్తగా 2 వేలకు పైగా ‘రెస్క్యూ డిపార్ట్‌మెంట్లు’ 8 అత్యవసర రెస్క్యూ టీంలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సైట్ ఫైర్ రెస్క్యూ టీమ్‌లు, వరద నియంత్రణ బృందాలు, పట్టణ నిర్వహణ టీమ్‌లు ఉన్నాయి. ఈ 15 భవనాల చుట్టూ ఉన్న అన్ని దుకాణాలు మూసివేశారు. సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి పంపించారు. ఈ భవనాలన్నీ లియాంగ్ స్టార్ సిటీ ఫేజ్ 2 ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. వీటి విలువ 1 బిలియన్ చైనీస్ యువాన్.

అయితే భవనాలు కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆకాశాన్నంటే భవనాలు కూలిపోతుంటే నెటిజన్లు ఒక్కొక్కరు కళ్లార్పకుండా వింతగా చూస్తుండిపోతున్నారు. ఇదెలా సాధ్యమైందని కామెంట్ చేస్తున్నారు. కొన్ని సెకన్లపాటు ఆ ప్రాంతంలో భూమి కంపిచవచ్చని ఒక వినియోగదారు వ్యాఖ్యానించాడు. చాలామంది వీడియోను పదే పదే చూస్తూ షేర్స్, కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్ని బిల్డింగ్‌లు ఒక్కసారిగా కూలిపోయే దృశ్యం అందరిని భయానకానికి గురిచేసిందని చెప్పవచ్చు.

సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం.. 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇంటర్మీడియట్ స్థాయికి పెంపు

Ayodhya Temple: రామమందిరం నిర్మాణంలో కీలకఘట్టం.. 48 లేయర్స్‌తో పునాది నిర్మాణం

Amit Shah: పటేల్‌ పరాక్రమం వల్లే రాష్ట్రానికి విముక్తి.. పవర్‌లోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంః అమిత్ షా