Viral: ఓర్నీ.! సెలవుల్లేకుండా 104 రోజులు నాన్‌స్టాప్ పని.. ఆ తర్వాత జరిగింది అస్సలు ఊహించలేరు

|

Sep 08, 2024 | 11:58 AM

మనం ఏదైనా పని చేస్తున్నామంటే..? ఆ పని పూర్తికాకపోయినా.. మన శరీరానికి మాత్రం అందులో నుంచి చిన్న బ్రేక్ అయినా తప్పనిసరిగా కావాలి. లేదంటే ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే. మీకు ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. కొంచెమైనా బ్రేక్ ఇవ్వకుండా నిరంతరం యంత్రాలను పని చేస్తే..

Viral: ఓర్నీ.! సెలవుల్లేకుండా 104 రోజులు నాన్‌స్టాప్ పని.. ఆ తర్వాత జరిగింది అస్సలు ఊహించలేరు
Work Culture
Follow us on

మనం ఏదైనా పని చేస్తున్నామంటే..? ఆ పని పూర్తికాకపోయినా.. మన శరీరానికి మాత్రం అందులో నుంచి చిన్న బ్రేక్ అయినా తప్పనిసరిగా కావాలి. లేదంటే ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే. మీకు ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. కొంచెమైనా బ్రేక్ ఇవ్వకుండా నిరంతరం యంత్రాలను పని చేస్తే.. కచ్చితంగా పాడైపోతాయి. మరి మనిషి బ్రతకగలడా.? దీనికి సమాధానం మీకు తెలిసిందే..! వరుసగా 104 రోజులు సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేసిన ఓ వ్యక్తి చివరికి ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి.. చనిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన చైనాలో చోటు చేసుకుంది.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

వివరాల్లోకి వెళ్తే.. చైనాలో కార్మిక చట్టాలు అంత కఠినంగా ఉండవు. అందుకే తయారీ రంగానికి చైనా కేంద్రంగా మారింది. అయితే ఇటీవల అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి.. అర్గాన్స్ డ్యామేజ్ కారణంగా మృతి చెందాడు. సదరు కంపెనీ అతడ్ని బానిసలా చూసేదని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అతడు 104 రోజులు నిరంతరం పనిచేశాడని, రోజుకు 8 గంటలు మాత్రమే కాకుండా ఓవర్‌టైమ్ కూడా వర్క్ చేశాడని చెప్పారు. అందుకే అతడి ఆరోగ్యం క్షీణించిందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 6న అతడు సెలవు తీసుకోగా.. ఆ తర్వాత మే 25 వరకు ఎలాంటి సెలవు లేకుండా నిరంతరం పని చేశాడు. మే 25న, అతడి ఆరోగ్యం క్షీణించింది. ఇక మూడు రోజుల తర్వాత అతడి పరిస్థితి విషమంగా మారింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇబ్బందితో పాటు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా జూన్ 1న సదరు ఉద్యోగి మరణించాడు. వరుసగా నలభై ఎనిమిది గంటల పాటు డ్యూటీలో ఉన్న అతడు ఒక్కసారిగా ఫ్యాక్టరీలో కుప్పకూలిపోయాడు. విపరీతమైన శారీరక శ్రమ కారణంగా అవయవాలు విఫలమవడంతో సహచరులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

కంపెనీ కనీసం అతడిపై శ్రద్ధ చూపకపోవడంతో.. ఉద్యోగి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని కంపెనీపై ఆరోపణలు గుప్పిస్తూ.. కోర్టులో వాదించారు. అయితే తాము చైనా కార్మిక చట్టాలకు అనుగుణంగా పనిచేయించామని.. చనిపోయిన వ్యక్తిని ఎక్కువ గంటలు పని చేయమని అడగలేదని కంపెనీ తమ వాదనలు వినిపించింది. అయితే కంపెనీ ఒత్తిడి కారణంగా ఉద్యోగి చనిపోయాడని.. సదరు కంపెనీ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని చైనా కోర్టు నిర్ధారించింది. 56 వేల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంటే చైనీస్ యువాన్‌లో నాలుగు లక్షలు.

ఇది చదవండి: మూర్చబోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. స్కాన్ చేసి బిత్తరపోయిన వైద్యులు

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి