World’s Highest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. ఎక్కడుందో తెలుసా..ఇదిగో ఆ అద్భుత దృశ్యం

బహుశా ప్రపంచంలో ఎవరూ సాధించలేనిది చైనా సాధించి ఉండవచ్చు.. అంటే మూడు సంవత్సరాలలో ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించింది. అంతేకాదు.. త్వరలోనే ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

Worlds Highest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. ఎక్కడుందో తెలుసా..ఇదిగో ఆ అద్భుత దృశ్యం
Highest Bridge In The World

Updated on: Apr 21, 2025 | 7:19 PM

ప్రపంచంలోకెల్ల ఎత్తైన కట్టడం.. అనగానే అందరికీ గుర్తుకు వచ్చే దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా.. కానీ, ఇప్పుడు ఈ పేరు పక్కకు జరిగేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. డ్రాగ‌న్ కంట్రీ చైనా ఎవరికీ అందనంత ఎత్తులో ఏదో నిర్మిస్తోంది. బహుశా ప్రపంచంలో ఎవరూ సాధించలేనిది చైనా సాధించి ఉండవచ్చు.. అంటే మూడు సంవత్సరాలలో ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించింది. అంతేకాదు.. త్వరలోనే ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించింది చైనా.. ‘హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్’ అని పిలువబడే ఈ వంతెనను జూన్‌లో ప్రారంభించనుంది. గుయ్ ఝౌలోని దీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన నిర్మాణానికి 280 మిలియన్ డాలర్లు (రూ.2,400 కోట్లు) ఖర్చు చేశారని సమాచారం.. ఈ వంతెనను మధ్యలో ఎలాంటి సపోర్ట్ లేకుండా సస్పెన్షన్ బ్రిడ్జిగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

సమాచారం ప్రకారం, ఈ వంతెన నిర్మాణం తర్వాత ఒక గంట ప్రయాణం దాదాపు 1 నిమిషంలో పూర్తవుతుంది. చైనాలోని ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు. ఈ వంతెన ఒకసారి వినియోగంలోకి వస్తే గుయ్జౌలోని హువాజియాంగ్ గ్రాండ్ కేనియన్ రెండు వైపులా అనుసంధానించడమే కాకుండా ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొడుతుంది. భూమి నుండి 625 మీటర్లు (సుమారు 2,050 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా మారుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..