Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాయి. క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు, జంతువుల అల్లరి ఆటలు, ఫన్నీ వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అయితే, తాజాగా చింపాంజీలకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. అవును, జూ పార్క్ సంరక్షణలో ఉన్న ఈ రెండు చింపాజీలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నాయి. వాటి మధ్య ఏవో పాత కక్షలు ఉన్నట్లుగానే.. కర్రతో చెడమడా కొట్టేసుకున్నాయి. అది చూసిన పర్యాటకులు బిత్తరపోయారు. అచ్చం మనుషుల మాదిరిగానే కొట్టుకోవడం చూసి షాక్ అయ్యారు. వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మరికొందరు.. వాటి ఫైటింగ్ చూసి నవ్వుకుంటున్నారు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. జూ లో రెండు చింపాంజీలు ఉన్నాయి. వాటిలో ఒక చింపాంజీ కర్ర తీసుకుని.. మరో చింపాంజీని దారుణంగా కొట్టింది. ఆ తరువాత మరో చింపాంజి టర్న్ వచ్చింది. దాని చేతి నుంచి కర్రను లాక్కున్న మరో చింపాంజీ.. ఇట్స్ మై టర్న్ అంటూ దడదడలాంచింది. ఈ చింపాంజి దెబ్బకు మరో చింపాంజి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే చింపాంజీల గొడవను కొందరు పర్యాటకులు తమ ఫోన్ కెమెరాల్లో వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో waowafrica పేరుతో గల అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 21 వేల మందికిపైగా లైక్స్ కొట్టారు. వీడియోను చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. చింపాంజీల డిష్యూం.. డిష్యూం ఫైట్‌ను మీరూ చూసేయండి.