Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం ట్రెండింగ్‌లో నిలుస్తుందో ఎవరూ ఊహించలేరు. ఓ టాపిక్ ట్రెండింగ్‌లో ఉండగానే.. మరో అంశంలో లైమ్‌లైట్‌లోకి వస్తుంది. ఇలా నిత్యం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే ఎన్నెన్నో ప్రత్యేక అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పెళ్లిళ్లు, జంతువులు, భార్యభర్తల సరదాలు, ప్రాంక్‌లు, జంతువులు-మనుషుల ప్రేమానుబంధాలు, క్రూర మృగాల వేటలు, జంతువుల అల్లరి చేష్టలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఫన్నీ, షాకింగ్ వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. ఆ వీడియోలు చూసినప్పుడు నెటిజన్లకు కాస్త రిలాక్స్ అవుతుంటారు. నవ్వుకుంటుంటారు. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రెండు చింపాంజీలు చేసిన పని చూస్తే.. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెబుతారంతే.
రెండు చింపాంజీలు డ్రోన్ ఎగురవేస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చింపాంజీ డ్రోన్‌కు సంబంధించి రిమోట్ కంట్రోల్‌ని పట్టుకుని ఉండగా.. మరొక చింపాంజి దానిని నిశితంగా గమనిస్తోంది. ఈ రెండు చింపాంజీలు డ్రోన్‌ను చాలా సీరియస్‌గా ఎగురవేస్తున్నట్లుగా అందులో స్పష్టమవుతోంది. ఈ వీడియోను పరిశీలిస్తే.. అందులోని చింపాంజీలు శిక్షణ పొందినట్లు స్పష్టమవుతోంది. ఇవి మనుషుల మాదిరిగానే అనేక పనులు చేయగలదని అర్థమవుతోంది.
అయితే, చింపాంజీలు డ్రోన్‌ను ఎగురవేయడానికి సంబంధించిన వీడియోను hayatevahsh_clip అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దాంతోపాటు లైక్స్ కూడా విపరీతంగా వచ్చాయి. చింపాంజిల తెలివితేటలను చూసి నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు. వాటికి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. డ్రోన్‌ని అద్భుతంగా మానిటరింగ్ చేస్తున్నాయంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఇది నిజంగా అద్భుతం అని మరికొందరు పేర్కొంటున్నారు.
Viral Video:
Also read:
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన గోల్డ్ రేటు.. తాజాగా ధరల వివరాలు
Rains Alerts: తెలంగాణలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..