పాత సామాగ్రి సర్దుతుండగా 60 యేళ్ల నాటి బ్యాంక్ పాస్బుక్ లభ్యం..అతన్ని రాత్రికి రాత్రే మిలియనీర్ చేసింది..!

|

Oct 24, 2023 | 8:54 PM

హీనోజోషా తండ్రి 10 సంవత్సరాల క్రితం మరణించాడు. అతని మరణానంతరం, ఆ పుస్తకం దశాబ్దాలుగా అలాగే, పెట్టెలోనే భద్రంగా ఉండిపోయింది. ఇప్పటికీ అతడు..తన ఇంటిని శుభ్రం చేస్తుండగా, పాత సామాగ్రిలో ఏళ్లనాటి బ్యాంక్‌ పాస్‌ బుక్‌ బయటపడింది. బ్యాంక్ బుక్‌పై 'స్టేట్ గ్యారెంటీ' అని రాసి ఉంది..అదే అతని జీవితాన్ని మార్చేసింది.

పాత సామాగ్రి సర్దుతుండగా 60 యేళ్ల నాటి బ్యాంక్ పాస్బుక్ లభ్యం..అతన్ని రాత్రికి రాత్రే మిలియనీర్ చేసింది..!
Chilean man became millionaire
Follow us on

రాత్రికి రాత్రే చాలా మంది అదృష్టాలు మారిపోతుంటాయి. చిలీలో ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. నివేదిక ప్రకారం, Xquiel Hinojosa తన దివంగత తండ్రి వస్తువులను సర్దుతుండగా.. ఆరు దశాబ్దాల నాటి బ్యాంక్ పాస్‌బుక్‌ కనిపించింది. అదే అతని అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేసింది. 1960-70లలో హినోజోసా తండ్రి ఇల్లు కొనడానికి పొదుపు చేసుకున్నాడు. అతను సుమారు 140,000 పెసోలు (రూ. 2 లక్షలు) ఆదా చేయగలిగాడని పాస్‌బుక్ వెల్లడించింది. అయితే, ఆ డబ్బు పూర్తి వడ్డీతో కలిపి 140,000 పెసోలు ఇప్పుడు 1 బిలియన్ పెసోలు అంటే దాదాపు $1.2 మిలియన్ (రూ. 8.22 కోట్లు) కంటే ఎక్కువగా పెరిగింది.

చీలీకి చెందిన హీనోజోషా అనే వ్యక్తి తండ్రి సొంత ఇంటిని కొన్నుకోవాలనే కలతో 60 యేళ్ల క్రితం ఓ బ్యాంకులో ఖాతా తెరిచి డబ్బులు దాచుకున్నాడు.. అయితే, అతడు సీక్రెట్‌గా జమ చేసుకున్న బ్యాంకు ఖాతా, అతని తండ్రి పొదుపు గురించి కుటుంబంలో ఎవరికీ తెలియదు. అయితే, హీనోజోషా తండ్రి 10 సంవత్సరాల క్రితం మరణించాడు. అతని మరణానంతరం, ఆ పుస్తకం దశాబ్దాలుగా అలాగే, పెట్టెలోనే భద్రంగా ఉండిపోయింది. ఇప్పటికీ అతడు..తన ఇంటిని శుభ్రం చేస్తుండగా, పాత సామాగ్రిలో ఏళ్లనాటి బ్యాంక్‌ పాస్‌ బుక్‌ బయటపడింది. బ్యాంక్ బుక్‌పై ‘స్టేట్ గ్యారెంటీ’ అని రాసి ఉంది..అదే అతని జీవితాన్ని మార్చేసింది.

కానీ, దురదృష్టవశాత్తు తన తండ్రి పొదుపు చేసిన బ్యాంకు చాలా కాలం క్రితమే మూతపడిందని తెలిసింది. ఇలాంటి బ్యాంకు పాసు పుస్తకాలు పనికిరానివిగా తేల్చేశారు. కానీ, వారికి దొరికిన పాస్‌బుక్‌లో “స్టేట్ గ్యారెంటీ” అని రాసి ఉన్న ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. దీని అర్థం బ్యాంక్ చెల్లింపులు చేయలేకపోతే, దానిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం డబ్బు చెల్లించడానికి నిరాకరించడంతో, హినోజోసా రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా పోరాడిల్సి వచ్చింది. ఈ డబ్బు తన తండ్రి ఎంతో కష్టపడి కూడబెట్టడాని,ఆ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదని వివరించారు. ఈ క్రమంలో రాష్ట్రంపై కేసు పెట్టాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదని వాపోయాడు. దీంతో కోర్టు తన ఆవేదనను అర్థం చేసుకుంది.. అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. చివరకు, సుప్రీం కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వం అతనికి 1 బిలియన్ చిలీ పెసోలను (సుమారు రూ. 10 కోట్లు) వడ్డీ, అలవెన్సులతో కలిపి పూర్తిగా చెల్లించింది. దాంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..