
కలలు వాస్తవంగా మారాలంటే పోరాటం, దృఢ సంకల్పం మాత్రమే మార్గం. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాకు చెందిన రైతు బజరంగ్ రామ్ భగత్ ఇందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తున్నారు. అతను తన కూతురికి దీపావళి కానుకగా స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దానిని అతను సాకారం చేసుకున్నాడు. తన ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ రైతు బజరంగ్ రామ్ భగత్ తన కూతురికి దాదాపు లక్ష రూపాయల విలువైన స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ కలను నెరవేర్చుకోవడానికి అతను గత 6 నెలలుగా నిరంతరాయంగా కష్టపడ్డాడు. ఈ 6 నెలల్లో అతను ప్రతి పైసాను ఆదా చేసి, తన కూతురి స్కూటర్ కోసం డబ్బును జమచేశాడు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను తన కూతురికి స్కూటర్ కొనడానికి షోరూమ్‌కు వెళ్ళినప్పుడు, అతన్ని చూసిన షో రూమ్ సిబ్బంది అంతా షాక్ అయ్యారు.. అతను వెంట తెచ్చిన డబ్బుల మూఠాను చూసి వారంతా కంగుతిన్నారు. రైతు తెచ్చిన నగదులో 40వేల రూపాయలు పూర్తిగా నాణేలు కావడంలో షోరూం సిబ్బంది మొత్తం కూర్చుని డబ్బులు లెక్కించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియోలో రైతు బజరంగ్ రామ్ భగత్ ఒక షోరూమ్‌లో కూర్చుని ఉన్నాడు. అక్కడ షోరూమ్ సిబ్బంది తన నాణేలను లెక్కించడంలో బిజీగా ఉన్నారు. అతని కుమార్తె కూడా అతను కొనుగోలు చేసిన స్కూటర్‌తో పాటు అతనితో ఉంది. బజరంగ్ రామ్ భగత్ మనోభావాలను గౌరవిస్తూ, షోరూమ్ యజమాని ఓపికగా కూర్చుని అతని 40,000 రూపాయల విలువైన నాణేలను లెక్కించి అతనికి స్కూటర్‌ను అందజేశారు. అంతేకాదు.. షోరూమ్ సిబ్బంది బజరంగ్ రామ్ భగత్‌కు కొన్ని బహుమతులు కూడా ఇచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి..
పూర్తి నగదుతో స్కూటర్ కొన్నాను, కానీ అప్పు తీసుకోలేదు:
బజరంగ్ రామ్ భగత్ వ్యవసాయంతో పాటు, తన గ్రామంలో గుడ్లు, శనగలు అమ్మే చిన్న దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. గత ఆరు నుండి ఏడు నెలలుగా, అతను తన కుమార్తె చంపాకు స్కూటర్ కొనడానికి 10, 20 రూపాయల నాణేలను సేకరించాడు. బజరంగ్ రామ్ భగత్ స్కూటర్ కోసం షోరూమ్ యజమానికి రూ. 98,700 చెల్లించాడు. అందులో రూ. 40,000 నాణేలు ఉన్నాయి. అతను స్కూటర్‌ను పూర్తిగా నగదు రూపంలో కొనుగోలు చేశాడు. ఒక్క రూపాయి కూడా అప్పుపెట్టలేదని గర్వంగా చెబుతున్నాడు.
నాణేలను లెక్కించడానికి 3 గంటలు పట్టింది.
షోరూమ్ యజమాని ఆనంద్ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం, రైతు చెల్లించిన నగదు తీసుకోవడానికి మూడు గంటల ముందు నాణేలను లెక్కించారు. చెల్లింపు పూర్తయిన తర్వాత స్కూటర్‌ను ఆ రైతు కుటుంబానికి అప్పగించారు. లక్కీ డ్రాలో భాగంగా షోరూమ్ ఆ కుటుంబానికి మిక్సర్ గ్రైండర్‌ను కూడా ఇచ్చింది. ఆ రైతు కూతురు చంపా బి.కామ్ చదువుతోంది. తన తండ్రి ఇచ్చిన కానుకకు సంతోషిస్తూ.. ఈ స్కూటర్ కుటుంబానికి వారి రోజువారీ పనులు, రవాణాకు సహాయపడుతుందని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..