Chennai techie loses balance due to pothole: అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉదయాన్నే ఆఫీస్‌కు బయలుదేరాడు.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రోడ్డుపైనున్న గుంత అతనికి యమపాశంగా మారింది. బైక్ గుంతలో పడటంతో.. వాహనదారుడు బస్సు చక్రల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని 32 ఏళ్ల టెక్కీ మహమ్మద్ యూనస్ తన కార్యాలయానికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈ క్రమంలో బైక్ గుంతలో పడటంతో బస్సు కిందపడి మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో సోమవారం ఉదయం 8.44 గంటలకు ఈ ఘటన జరిగింది.
బైక్‌పై వెళుతుండగా.. బైక్ గుంతలో పడింది. దీంతో ఆ యువకుడు ద్విచక్ర వాహనంపై బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అప్పుడే ఎడమ వైపు వెళుతున్న సిటీ బస్సు కిందకు వాహనం దూసుకెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపసారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నా.. మరణించాడు. బస్సు చెన్నై బీసెంట్ నగర్ నుంచి చిన్నమలై మీదుగా వడపళని వెళ్తోందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గిండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
వైరల్ వీడియో..
32 yr old Mohammad Yunus, a software engineer was killed in Anna Salai, Chennai, when he lost balance of his bike because of pothole and came under a government bus. pic.twitter.com/OH6Mn4G5ue
— Mugilan Chandrakumar (@Mugilan__C) November 1, 2021
Also Read: