Watch Video: మాస్కులు ధరించి తుపాకులతో వచ్చారు.. రూ. కోటి ఎత్తుకెళ్లారు.. పట్టపగలే దొంగల బీభత్సం .. వీడియో

Robbers Loot Rs 1 Crore: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎప్పుడూ.. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన దేశంలోనే కలకలం రేపింది.

Watch Video: మాస్కులు ధరించి తుపాకులతో వచ్చారు.. రూ. కోటి ఎత్తుకెళ్లారు.. పట్టపగలే దొంగల బీభత్సం .. వీడియో
Mumbai Crime

Updated on: Feb 03, 2022 | 12:39 PM

Robbers Loot Rs 1 Crore: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎప్పుడూ.. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన దేశంలోనే కలకలం రేపింది. తుపాకులతో ఓ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి రూ. కోటి రూపాయిలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ముంబై (Mumbai)లోని ములుంద్ ప్రాంతంలోని ఓ సంస్థ కార్యాలయంలో చోటుచేసుకుంది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్నులతో వచ్చారు. అనంతరం అక్కడున్న వారిని బెదిరించి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. పంచ రాస్తా ప్రాంతంలో ఆర్థిక సేవలు నిర్వహించే దుకాణంలో బుధవారం (ఫిబ్రవరి 2న) (Robbery) ఈ ఘటన జరిగింది. ఈ దోపిడీ ఘటన మొత్తం కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.

మాస్క్‌లు ధరించిన ముగ్గురు దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి పిస్టల్స్ సహాయంతో ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం కార్యాలయంలో ఉంచిన నగదును బ్యాగులో వేసుకొని దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియో..

వీడియో ఆధారంగా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఉందన్న విషయం వారికి ఎలా తెలిసి ఉంటుందన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Akhanda: బాలయ్య ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరీ.. అఖండ పై అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..

Bizarre News: బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి మహాప్రభో.. కోర్టును వేడుకున్న హత్య కేసు నిందితుడు