అధ్వాన్నంగా ఉంటున్న రోడ్లపై ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. తరచూ ప్రమాదాల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్ర వాహన దారులు, ఫోర్ వీలర్ నడిపే వారితో పాటు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించే వారు కూడా ప్రతి రోజూ ఎదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. రోడ్ల దుస్థితి కారణంగా కూడా నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. అలాగే గుంతల కారణంగా ప్రయాణికులు, వాహనదారుల్లో వెన్నెముక సమస్యలు కూడా సర్వసాధారణమైంది. ఇదిలా ఉంటే ఈ గుంతల వల్ల ఓ మహిళ ప్రమాదంలో పడగా, బస్ కండక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి ఆమె ప్రాణాలను కాపాడాడు.. ఉత్కంఠ రేపుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వేగంగా వెళ్తున్న బస్సులో ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే.
వైరల్‌గా మారిన ఈ వీడియో తమిళనాడుకు చెందినదిగా తెలిసింది. ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డ్ కావడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. నడుస్తున్న బస్సు నుంచి కింద పడిన మహిళ ప్రాణాలను బస్ కండక్టర్ ఎలా కాపాడగలిగాడో స్పష్టం కనిపించింది. వీడియో చూస్తే ఒక్కక్షణం అందరిలో వణుకు మొదలైంది.
A bus conductor saved a woman from falling off a moving bus in #Erode in #TamilNadu.
In the CCTV footage of the bus, which has now gone viral on social media, the conductor of a private bus, plying from Erode to #Mettur, can be seen saving the life of a woman who tripped and… pic.twitter.com/TBXIhmT2ac
— Hate Detector 🔍 (@HateDetectors) February 1, 2024
ఈ వీడియోలో చూస్తే బస్సు వేగంగా నడుస్తోంది. ఈ సమయంలో, మహిళ తన సీటు నుండి లేచి తదుపరి స్టాప్‌లో దిగడానికి బస్సు తలుపు దగ్గరకు వచ్చింది. అంతలోనే బస్సు ఒక గుంటలోకి వెళ్లి కుదుపుకు గురైంది. దాంతో ఆ మహిళ జారిపడిపోయింది.. తెరిచి ఉన్న బస్సు తలుపులోంచి ఆమె బయటపడబోతుండగా అక్కడే నిలబడి ఉన్న కండక్టర్ ఆమెను చాకచక్యంగా కాపాడాడు. ఆమెను ఎలాగైన కాపాడాలనే క్రమంలో కండక్టర్ ఆమె జుట్టు పట్టుకుని బస్సులోకి లాగాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..