సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ (viral video) అవుతుంటాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, గున్నఏనుగుల వీడియోలు ట్రెండింగ్ లో (Trending video) ఉంటాయి. కుక్కలు, పిల్లులతో సరదాగా ఆడుకోవడం, పిల్లుల చేష్టలు, గున్న ఏనుగుల ఫన్నీ సంఘటనలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే, మీరు ఎప్పుడైనా పిల్లి, కుందేలు స్నేహాన్ని చూశారా…? ఇంకా చెప్పాలంటే వాటి ఆటలో సరదాగా తన్నుకోవటం చూశారా..? ఖచ్చితంగా లేదనే అంటారు..కానీ,వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లి,కుందేలు మధ్య చిలిపి,అల్లరి చేష్టలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…
సాధారణంగా కుందేళ్ళు వాటిపనిలో అవి ఉంటాయి… పెద్దగా అల్లర్లు చేయవు. కానీ, పిల్లులు అలాకాదు, తమ చుట్టూ ఉన్న ఎవరితోనైనా గిల్లి కజ్జాలకు వెళ్తుంటాయి.. ముఖ్యంగా అవి పెంపుడు జంతువులైతేనే ఇది సాధ్యం. లేదంటే, ఒకదాని కొకటి కొట్టుకు చస్తాయి… అలాంటి పిల్లి ఒక కుందేలుకు విసుగు తెప్పించిన వీడియో ఇది.. పిల్లి, కుందేలు రెండు పక్క పక్క బెడ్లలో పడుకుని ఉన్నాయి. అయితే, పాపం కుందేలు కాస్త ఎత్తుగా ఉన్న బెడ్‌పై పడుకుని ఉంది.. ఆ పక్కనే భారీ కాయంతో ఉన్న పిల్లి పడుకుంది. ఆ పిల్లి ఎంత చిలిపిదంటే..కుందేలు పడుకున్న టైమ్ చూసి మెల్లిగా తన కాలితో తన్నుతోంది. అలా ఒకసారి పిల్లి కుందేలును తన్నింది. దాంతో ఆ కుందేలు టక్కున నిద్రలేచి కూర్చింది. అలా చూస్తుండగానే, పిల్లి మరోసారి కుందేలుని తన్నుతుంది..ఈ రెండింటి మధ్య జరిగిన ఈ ఫన్నీ సీన్ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఓర్నీ ఈ పిల్లి ఎంత చిలిపిది.. పాపం కుందేలుకు నిద్రపట్టకుండా చేస్తోంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సూపర్ ఫన్నీ వీడియోని జపనీస్ వినియోగదారు తన Instagram రీల్స్‌లో పోస్ట్ చేయగా, మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. లక్షల సంఖ్యలో లైక్‌లతో వైరల్‌గా మారింది. మరెందుకు ఆలస్యం మీరు ఈ ఫన్నీ సీన్ చూసి ఎంజాయ్ చేసేయండి..